breaking news
ICC T20 international rankings
-
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన సూర్యకుమార్.. నెంబర్ 1 స్థానానికి చేరువలో!
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులతో అదరగొట్టిన సూర్య.. ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 816 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విండీస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 111 పరుగులు సాధించాడు. అంతకుముందు ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన సుర్యకుమార్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 15 స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వెస్టిండీస్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ 27 ర్యాంక్‌కు చేరుకోగా, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో 31వ స్థానంలో నిలిచాడు. ఇక 818 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా సూర్య మరో మూడు పాయింట్లు సాధిస్తే బాబర్‌ను అధిగమించి నెంబర్ 1 ర్యాంకుకు చేరుకునే అవకాశం ఉంది. కాగా వెస్టిండీస్ పర్యటనలో మరో రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లలోనూ సూర్య అదరగొడితే పాక్ కెప్టెన్ ర్యాంకుకు ప్రమాదం తప్పదు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్- టాప్-10లో ఉన్నది వీళ్లే: 1.బాబర్ ఆజమ్(పాకిస్తాన్)- 818 పాయింట్లు 2. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 816 పాయింట్లు 3. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు 4. ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 788 పాయింట్లు 5. డేవిడ్ మలన్(ఇంగ్లండ్)- 731 పాయింట్లు 6.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు 7. డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 668 పాయింట్లు 8.పాథుమ్ నిశాంక(శ్రీలంక)- 661 పాయింట్లు 9.నికోలస్ పూరన్(వెస్టిండీస్)- 652 పాయింట్లు 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్)- 643 పాయింట్లు చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత! టీమిండియా తొలి ఆల్‌రౌండర్‌గా.. -
నంబర్‌వన్‌గా విరాట్ కోహ్లి
ఐసీసీ అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ న్యూఢిల్లీ: అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐసీసీ అంతర్జాతీయ టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా టోర్నీలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లి 184 పరుగులు సాధించాడు. టోర్నీకి ముందు టాప్‌లో ఉన్న ఆరోన్ ఫించ్‌ను వెనక్కినెట్టిన కోహ్లి (871 పాయింట్లు) అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రి టాప్కు చేరుకున్నాడు. అశ్విన్ ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.జడేజా ఏడు, బుమ్రా 13వ స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ పొట్టి ఫార్మాట్‌ను నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ముగించాడు.