నంబర్‌వన్‌గా విరాట్ కోహ్లి | ICC Rankings: Virat Kohli becomes No. 1 T20 batsman | Sakshi
Sakshi News home page

నంబర్‌వన్‌గా విరాట్ కోహ్లి

Mar 30 2016 12:22 AM | Updated on Sep 18 2018 8:48 PM

నంబర్‌వన్‌గా విరాట్ కోహ్లి - Sakshi

నంబర్‌వన్‌గా విరాట్ కోహ్లి

అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐసీసీ అంతర్జాతీయ టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు.

ఐసీసీ అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్
 న్యూఢిల్లీ: అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐసీసీ అంతర్జాతీయ టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా టోర్నీలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కోహ్లి 184 పరుగులు సాధించాడు. టోర్నీకి ముందు టాప్‌లో ఉన్న ఆరోన్ ఫించ్‌ను వెనక్కినెట్టిన కోహ్లి (871 పాయింట్లు) అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
 
 బౌలింగ్ విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రి టాప్‌కు చేరుకున్నాడు. అశ్విన్ ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.జడేజా ఏడు, బుమ్రా 13వ స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ పొట్టి ఫార్మాట్‌ను నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ముగించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement