ICC T20I Rankings: బాబర్‌ ర్యాంకుకు ఎసరుపెట్టిన సూర్య! నెంబర్‌ 1 స్థానానికి చేరువలో!

India star Suryakumar closing in on Babar after rapid T20I rankings rise - Sakshi

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సుర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి సత్తా చాటాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులతో అదరగొట్టిన సూర్య.. ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 816 పాయింట్లతో  రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు విండీస్‌ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌ 111 పరుగులు సాధించాడు.

అంత​‍కుముందు ఇంగ్లండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన సుర్యకుమార్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్‌ సిరీస్‌లో అదరగొట్టిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 15 స్థానానికి చేరుకున్నాడు.

మరోవైపు వెస్టిండీస్‌ బ్యాటర్‌ బ్రాండన్‌ కింగ్‌ 27 ర్యాంక్‌కు చేరుకోగా, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో 31వ స్థానంలో నిలిచాడు. ఇక 818 పాయింట్లతో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తొలి స్థానంలో  కొనసాగుతున్నాడు. కాగా సూర్య మరో మూడు పాయింట్లు సాధిస్తే బాబర్‌ను అధిగమించి నెంబర్‌ 1 ర్యాంకుకు చేరుకునే అవకాశం ఉంది.  కాగా వెస్టిండీస్‌ పర్యటనలో మరో రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లలోనూ సూర్య అదరగొడితే పాక్‌ కెప్టెన్‌ ర్యాంకుకు ప్రమాదం తప్పదు.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌- టాప్‌-10లో ఉన్నది వీళ్లే:
1.బాబర్‌ ఆజమ్‌(పాకిస్తాన్‌)- 818 పాయింట్లు
2. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 816 పాయింట్లు
3. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)- 794 పాయింట్లు
4. ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)- 788 పాయింట్లు
5. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లండ్‌)- 731 పాయింట్లు
6.ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు
7. డెవాన్‌ ​కాన్వే(న్యూజిలాండ్‌)- 668 పాయింట్లు
8.పాథుమ్‌ నిశాంక(శ్రీలంక)- 661 పాయింట్లు
9.నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)- 652 పాయింట్లు
10. మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌)- 643 పాయింట్లు
చదవండి:
 Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత! టీమిండియా తొలి ఆల్‌రౌండర్‌గా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top