
ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా బిజీలో ఉన్నాడు. వచ్చే నెల 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ విడుదల చేయగా.. స్పందన బాగానే వచ్చింది. తారక్ అభిమానులకు యాక్షన్ మూవీ చూడబోతున్నామని అంచనాలు పెంచేసుకున్నారు. మరోవైపు ఇతడి ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)
అయితే ఈ ఫొటోలు ఎన్టీఆర్‌కి చెందిన జూబ్లీహిల్స్ ఇంటివి అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం.. స్నేహితులతో కలిసి సింపుల్‌గా ఈ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్తగా అమర్చిన వాల్ ఫ్రేమ్స్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ లాంటివి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. చూస్తుంటే తారక్ ఇంటి కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తున్నాడు.
'వార్ 2' రిలీజ్‌కి రెడీ కాగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు నెల్సన్.. ఎన్టీఆర్‌తో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు 'దేవర 2' కూడా లైన్‌లో ఉంది. మరి వీటిలో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

