
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)
పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్‌ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్‌లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్‌కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్‌కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్‌కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్‌గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్‌పై అటు ట్రైలర్‌లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)