breaking news
war 2 Movie
-
‘దగ్గుపాటి.. చంద్రబాబు వదలిపెట్టినా.. మేం నిన్ను వదలం’
సాక్షి,అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ అధిష్టానం వెనకేసుకొస్తున్నట్లు తేలిపోయింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తాను చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని.. క్షమాపణలు కూడా చెప్పినందున ఆ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి రావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చంద్రబాబు, నారా లోకేష్‌లకు జూనియర్,ఎన్టీఆర్ అంటే నచ్చదని... మీరు కూడా సినిమా విడుదల చేయడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక ఒకవేళ సినిమా విడుదల చేస్తే స్క్రీన్లు కాల్చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.జూనియర్ ఎన్టీఆర్ పైనా ఆయన తల్లి నందమూరి షాలిని పైనా అసభ్యంగా మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లాగిపడేసిన పోలీసులు... వారిపై లాఠీచార్జి కూడా చేశారు. తమ అభిమాన హీరో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను పిలిపించి వివరణ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనను మందలించి వదిలేసినట్లు ఎల్లో మీడియా లో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన పై స్పందించారు మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్. జూనియర్ ఎన్టీఆర్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్లారిటీ ఇచ్చారని..పైగా క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ.. కొందరు కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలాంటి అనవసరమైన విషయాలను పక్కనపెట్టి.. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలుసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు మంత్రులు. ఇది టీడీపీ అధిష్టానం ఉద్దేశం గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవద్దని మంత్రులు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సుమారు పది రోజుల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధం కాగా..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకుంటారని, మీరు సమావేశానికి వెళ్లొద్దని కొందరు అధికార పార్టీ నేతలు, ఇంటిలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొనే కార్యక్రమాల్లో ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. -
War 2 Movie: ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని..!
-
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తన మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కూలీ, వార్2 సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ సినిమా విడుదలైతే తప్పకుండా తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు చూస్తారు. అయితే, కొంత కాలంగా తారక్‌ను నందమూరి, నారా ఫ్యామిలీలు దూరంగానే ఉంచుతూ వస్తున్నాయి. వార్ 2 మూవీ విడుదల సమయంలో తారక్‌పై టీడీపీ ఎమ్మెల్యేనే భూతులతో విరుచుకుపడ్డాడు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వార్2 సినిమా చూశారా అని 'నారా రోహిత్'ని ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'వార్ 2 సినిమా చూడలేదు. మా గ్యాంగ్ అంతా కూలీ సినిమా చూద్దాం అన్నారు. అప్పుడు నేనూ కూడా 'కూలీ' కోసమే వెళ్లాను. సినిమా అక్కడక్కడ నచ్చింది. ఓవరాల్‌గా పర్వాలేదు. వార్2 చూడలేదు. కానీ, సమయం దొరికితే తప్పకుండా చూస్తాను.' అని అన్నారు. అయితే, ఇక్కడ నారా రోహిత్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మొదట కుటుంబ సభ్యుల సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.తారక్‌తో తనకు మంచి స్నేహం ఉందని నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. ఎక్కడైనా తాము ఎదురైతే మంచిగానే మాట్లాడాతుమాన్నారు. కానీ, పెద్దగా ఫోన్స్‌లలో మాట్లాడుకోవడం వంటివి మాత్రం లేవన్నారు. -
ఏంటి..నన్ను మిస్ అవుతున్నారా? : నాగవంశీ
ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే హీరోహీరోయిన్లు రంగంలోకి దిగాల్సిందే. వాళ్లు ప్రచారం చేస్తేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎక్కువగా నటీనటులతోనే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు పెడుతుంటారు. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. కానీ వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు అంతగా వైరల్ కావు. కానీ ఈ నిర్మాత మాత్రం కాస్త స్పెషల్. ఆయన ఏం మాట్లాడినా.. ట్వీట్ చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ.. పక్కన ఆయన ఉంటే మీడియా ఫోకస్ అంతా అటువైపే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చెప్పే విషయాలు, ఇచ్చే హైప్ మామలుగా ఉండదు. కొన్నిసార్లు అవసరానికి మించిన హైప్ ఇచ్చి.. ట్రోలింగ్కి కూడా గురవుతుండాడు. ఆయనే యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi ).సితారఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. మొన్నటి వరకు వరుస విజయాలను చూసిన నాగవంశీకి ఇటీవల మాత్రం దెబ్బ మీద దెబ్బలు తాకుతున్నాయి. ఆయన నిర్మించిన చిత్రాలతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. ఆయన బ్యానర్ నుంచి భారీ అంచనాలతో రిలీజైన ‘కింగ్డమ్’ మూవీకి హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక భారీ ధరకు కొనుగోలు చేసిన వార్ 2 చిత్రం కూడా నాగవంశీకి నష్టాలనే మిగిల్చింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వంశీ... వార్ 2 రిలీజ్ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నా స్పందించలేదు. ఒకనొక దశలో సోషల్ మీడియాను దూరం పెట్టాడనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనను ట్రోలింగ్ చేస్తున్నవారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్లడం లేదని, ఇంకో 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ' ఏంటి.. నన్నుచాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అని గ్రిప్పింగ్ తో ఫుల్ల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు. ఎక్స్ లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు నన్ను క్షమించండి. కానీ, ఇంకా ఆ సమయం రాలేదు. మినిమమ్ 10 నుంచి 15 ఏళ్లు ఉంది. సినిమాలోనే.. సినిమా కోసం ఎల్లప్పుడూ. మాస్ జాతర అప్డేట్ తో త్వరలో మళ్లీ కలుద్దాం ' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.Enti nannu chala miss avthunattu unnaru.. 😂Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.At the cinemas… for the cinema,…— Naga Vamsi (@vamsi84) August 20, 2025 -
'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగింది. హిందీ బెల్ట్‌లో ‘వార్ 2’ హవా కనిపించగా.. దక్షిణాదిలో రజనీ ‘కూలీ’ జోరు కనిపించింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన "వార్ 2" తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, హిందీ బెల్ట్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు దగ్గరగా వార్2 కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, వార్ 2 తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సుమారు రూ. 80 కోట్ల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్లో అనుకున్నంతగా వార్2 కలెక్షన్స్ రాకపోవడంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ కొంత రిటర్న్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్లో 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై 'వార్ 2' చిత్రాన్ని నిర్మాత నాగవంశీ విడుదల చేశారు. సుమారు రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన సులువుగా రూ. రూ. 100 కోట్లకు పైగానే రాబడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుంచే కొందరు కావాలనే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఏపీలో తెలుగు దేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు మద్దతు ఇవ్వడం మానేసింది. వారు కూలీ సినిమా చూడాలని పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సూచించారు. అదే సమయంలో వార్2 చిత్రంపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ చాలా ప్రొఫెషనల్‌గానే ఢీల్ సెట్ చేసుకుంటుంది. ఈ సినిమాను కొనుగొలు చేసిన నాగవంశీకి కొంత ఉపశమనం అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం. నాగ వంశీతో పాటు అతని భాగస్వాములకు రూ. 22 కోట్లు తిరిగి ఇవ్వడానికి యష్ రాజ్ సంస్థ అంగీకరించినట్లు బాలీవుడ్ సమాచారం. నైజాంకు రూ. 10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్‌కు రూ. 5 కోట్ల వరకు ఇచ్చేందుకు గ్రీన్ లభించిందట. అయితే, హిందీలో ఈ చిత్రానికి ఎలాంటి నష్టం లేదని తెలుస్తోంది. -
ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్‌లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్2 సినిమా చూసేందుకు జపాన్ నుంచి తారక్ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్‌కు చెందిన 'క్రిసో' వార్2 చిత్రాన్ని చూసేందుకు భారత్ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్‌లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్‌కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను. ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్‌లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్షా’ సినిమాకే జపాన్‌లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. View this post on Instagram A post shared by ARS CineVerse | ARS ప్రయాణ ప్రపంచం (@arflyerar) -
'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు ముజీబ్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్మీట్లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పోలీస్‌స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్‌స్టేషన్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేఒక ఫోన్ కాల్లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
జూ. ఎన్టీఆర్ సినిమాను ఆపే దమ్ముందా! టీడీపీకి రోజా కౌంటర్
-
'కూలీ' vs 'వార్ 2'.. రెండు రోజుల కలెక్షన్ ఎవరికెంత?
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే రెండు కూడా పూర్తిస్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. కొందరికి ఈ మూవీస్ నచ్చితే.. మరికొందరు మాత్రం ఓకే ఓకే ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ప్రేక్షకులు.. థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ చిత్రాలకు ఎంతెంత వచ్చాయి? ఎవరు ముందున్నారు?'కూలీ' గురించి ముందుగా మాట్లాడుకుంటే.. తొలిరోజు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డ్ కూడా సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. అయితే మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజు నంబర్లు కాస్త డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రూ.86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. అంటే రెండు రోజుల్లో కలిపి దగ్గరదగ్గర రూ.240 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్.(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)'కూలీ' రెండో రోజ వసూళ్లలో తమిళం నుంచి రూ.34 కోట్లు రాగా, తెలుగు-హిందీల నుంచి వరసగా రూ.13.5 కోట్లు, రూ.7.5 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్‌లోనూ తమిళంతో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని దీనిబట్టి అంచనా వేయొచ్చు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ ఉండటం ఈ మూవీకి ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతోంది.మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే.. నిర్మాతలు అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల్లో కలిసి రూ.115 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెండోరోజు రూ.56.5 కోట్ల నెట్ వచ్చినట్లు వినిపిస్తోంది. మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజే కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్‌గా హిందీలో రూ.75 కోట్ల నెట్ రాగా, తెలుగు నుంచి రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే 'కూలీ'నే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి అధికారిక నంబర్లు ప్రకటిస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.(చదవండి: వార్ 2 మూవీ రివ్యూ)మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. (చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి. -
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్‌లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?.. చేయి కోసుకుని మరి..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్‌కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రూ.31 కోట్లతో ఆస్తి కొనుగోలు చేసిన హృతిక్ రోషన్
కొత్త సినిమా వార్2తో అలరిస్తున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటనలోనే కాదు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. ఆస్తులు కూడబెట్టడంలో, వాటి విలువను పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ముంబయిలోని ఓ ఆస్తిని కొనుగోలు చేయడంతో అందుకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ స్థాపించిన హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కంపెనీ కోసం ముంబైలోని చండీవాలి ప్రాంతంలో మూడు కార్యాలయ యూనిట్లను రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ఈస్ట్‌లోని చండీవలి ప్రాంతంలోని బూమరాంగ్ పేరుతో ఉన్న భవనం మొదటి అంతస్తులోని ఈ మూడు కార్యాలయాలు 13,546 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దీనికి సంబంధించి 2025 జులై 9న కొనుగోలు జరిగిందని డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తుంది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ లావాదేవీలో స్టాంప్ డ్యూటీ రూ.1.86 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలుగా ఉంది. ఈ లావాదేవీలో అమ్మకందారులుగా మనీష్ కృష్ణం గోపాల్ బజారీ, షాలిని మనీష్ బజారీ, బాజ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ భవనంలో రోషన్ కుటుంబం పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2024లో హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ ఐదో అంతస్తులోని ఐదు కార్యాలయ యూనిట్లను రూ.37.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో 17,389 చదరపు అడుగుల స్థలం ఉంది.ఇదీ చదవండి: భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చఇంతకు ముందు రోషన్ కుటుంబం రూ.6.75 కోట్లకు అంధేరీలో మూడు అపార్ట్ మెంట్లను విక్రయించింది. అంధేరీ వెస్ట్‌లోని విజయ్ నివాస్ సీహెచ్ఎస్ లిమిటెడ్ భవనంలో 1,025 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రాకేష్ రోషన్ విక్రయించారు. ఈ ఆస్తితో పాటు రెండు పార్కింగ్ స్థలాలను సోనాలి అజ్మీరాకు రూ.3.75 కోట్లకు విక్రయించారు. మే 25న జరిగిన ఈ లావాదేవీలో రూ.18.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మరో లావాదేవీలో రాకేష్ రోషన్ అంధేరి వెస్ట్‌లోని రహేజా క్లాసిక్ భవనంలోని 625 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను జీవన్ భావనానీ, శిల్పా వాధ్వానీ, గౌరవ్ వాధ్వానీ అనే ముగ్గురు వ్యక్తులకు రూ.2.20 కోట్లకు విక్రయించారు. ఈ లావాదేవీ మే 17న నమోదు కాగా, స్టాంప్ డ్యూటీ రూ.13.20 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.30 వేలు చెల్లించారు. -
వార్ 2 సినిమా హిట్టా..! ఫట్టా..!
-
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘వార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్,హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ & మైనస్ పాయింట్స్ ఏంటి తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025 -
మీరు నా మొదటి గురువు
‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్ దాదా’(1986). రాకేశ్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్ దాదా’ గా రజనీకాంత్ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది. ‘కూలీ, వార్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్ సార్.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు. -
అవ్వ - బువ్వ.. ఏదీ తేల్చుకోలేకపోతున్నా: మంచు మనోజ్
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం. 20 మందిని తీసుకెళ్తా..రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్‌గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్‌కు, కూలీ మూవీ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. “Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025 చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు! -
మరికొన్ని గంటల్లో ‘వార్ 2’ రిలీజ్.. హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు కలిసి నటించిన వార్ 2 చిత్రం మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండడంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు.‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి. స్పాయిలర్లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి’ అని ఎన్టీఆర్ తెలిపారు. -
తొలి రోజు 100 కోట్లు పక్కా..!
-
కూలీ, వార్ 2 సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెంపు
రజనీకాంత్ కూలీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇచ్చింది.సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది.అలానే హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇవ్వగా దాని టికెట్ ధర 500 గా నిర్ణయించింది. వార్ 2 విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. -
రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!
రజినీకాంత్ నటించిన కూలీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో విపరీతమైన క్రేజ్ వస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ కొద్ది నిమిషాల్లోనే బుక్కైపోతున్నాయి. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇవాళ తెలంగాణలోనూ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అదే దాదాపు అదే పరిస్థితే. రిలీజైన నిమిషాల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ కోసం ఎగబడ్డారు. బుక్‌మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లోనూ కూలీ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కంటే ముందుగా అదనంగా ఒక్క షోకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సైతం అదే రోజు విడుదలవుతోంది.Telangana Bookings Open Now!💥🍿🌟Book your tickets now: https://t.co/vFx0Jf1W9g#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/cT2jrHZv9c— Sun Pictures (@sunpictures) August 12, 2025 -
ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?
మరో రెండు రోజుల్లో రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఎవరెంత చెప్పినా సరే ఇవి స్ట్రెయిట్ మూవీస్ కావు. కాకపోతే రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ పుణ్యమా అని 'కూలీ' చిత్రానికి.. తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ అని 'వార్ 2'కి తెలుగులో రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే లేదు. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?'కూలీ' సినిమాకు చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో ఈ మూవీ టికెట్ గరిష్ఠ ధర రూ.183 నిర్ణయించారు. కానీ హైదరాబాద్‌లో ఇదే గ్రూప్ మల్టీప్లెక్స్‌లో రూ.350 నుంచి రూ.453 మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో జీవో రాబోతుంది. 'కూలీ'కి మాత్రమే కాదు 'వార్ 2'కి కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గర రిలీజయ్యే డబ్బింగ్ వెర్షన్‌కే ఎందుకింత ఎక్కువ టికెట్ రేట్లు?(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)తెలుగు ప్రేక్షకులు.. ఏ భాష సినిమా అయినా సరే బాగుంటే చాలు చూసేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఈ విషయాన్ని గ్రాంటెడ్ తీసుకుంటే.. రాబోయే రోజుల్లో నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే 'బంగారు బాతు గుడ్డు' కథ మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డుకాలం గ్యారంటీ!ప్రేక్షకుడు ఎప్పుడూ కోరుకునేది ఒకటే. సినిమా బాగుండాలి. టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి. నిర్మాతలు ఈ విషయం గుర్తుంచుకుని.. అందుకు తగ్గ మూవీస్ తీస్తే చాలు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా కాదని వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలని ఆశపడితే ప్రస్తుతానికి పర్లేదు కానీ రాబోయే రోజుల్లో అంతే సంగతులు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
పబ్లిక్ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్. తన ఫ్యాన్స్‌కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్మెంట్నే వదిలాడు తారక్. అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్ కామెంట్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్ అనడానికి ఓ కారణం ఉంది.సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్‌ను, వార్ 2 సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు.రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశాడు. కానీ అదే టైమ్‌లో జూ. ఎన్టీఆర్ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్ ఇలా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరో. ఈ గురువారం మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయిన తారక్.. ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. క్షమించాలి అని అంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)'వేదికపై ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. నా 25 ఏళ్ల కెరీర్‌ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలానే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులని ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి కారణమయ్యారు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్, హృతిక్ చేసిన 'వార్ 2' సినియా.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగం. కియారా అడ్వాణీ హీరోయిన్ కాగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకే ఆదివారం రాత్రి ఈవెంట్లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగోలేకపోతే తనని పదింతలు ఎక్కువ తిట్టండి అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు తారక్ కూడా చిత్ర ఫలితంపై నమ్మకంగా ఉన్నారు. హృతిక్‌తో కలిసి కాలర్ ఎగరేసి మరీ నమ్మకాన్ని చూపించారు.(ఇదీ చదవండి: ఆంధ్రాకు షిఫ్ట్ అయిన సినీ కార్మికుల వివాదం)My sincere thanks to the Government of Telangana and the honourable CM Shri @revanth_anumula garu, as well as the Telangana Police Department @TelanganaCOPs for their support in making the #War2 pre-release event a grand success. pic.twitter.com/krKp8xZejS— Jr NTR (@tarak9999) August 10, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటికోసం అభిమానులు ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ ఏకంగా 30 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ చిత్రాలే కొన్ని ఉన్నాయి.(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)ఓటీటీల్లో రిలీజయ్యే కొత్త సినిమాల విషయానికొస్తే జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, టెహ్రాన్ మూవీస్తోపాటు సారే జహాసే అచ్చా, అంధేరా సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. కొత్త చిత్రాలు.. వీకెండ్లో ఏమైనా సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఆగస్టు 11 నుంచి 17వరకు)జీ5టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15నెట్ఫ్లిక్స్సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 11ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 12ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) - ఆగస్టు 13సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 13ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) - ఆగస్టు 14ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15అమెజాన్ ప్రైమ్అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14హాట్స్టార్డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13లిమిట్లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) - ఆగస్టు 13బుక్ మై షోఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) - ఆగస్టు 11లయన్స్ గేట్ ప్లేద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) - ఆగస్టు 14మూవీ సెయింట్స్కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) - ఆగస్టు 15ఆపిల్ ప్లస్ టీవీస్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?) -
తారక్‌లో నన్ను నేను చూసుకున్నా: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన చిత్రం వార్-2. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న నాకు తమ్ముడు అంటూ ఎన్టీఆర్ అభిమానులను మనమంతా అన్నదమ్ములం. నేను తారక్ ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు కో స్టార్స్ లానే మొదలు పెట్టాం కానీ చిత్రం ముగిసే సమయానికి సొంత అన్నదమ్ముల్లా మారిపోయాం. ఎన్టీఆర్ అభిమానులను ఉద్ధేశిస్తూ.. నాకు మీరంతా ఒక మాట ఇవ్వాలి అదేంటంటే మీరు ఇప్పుడు ఏ విదంగా తారక్‌ను ప్రేమిస్తున్నారో అదే విదంగా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉండాలని కోరుతున్నాను, ఎందుకంటే తారక్ దానికి అర్హుడు.తారక్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఏ సీన్‌నైనా తారక్ తన వంద శాతం చేస్తాడు. తను ఒక సారి నటించాక ఇంకో షార్ట్ అనేది ఉండదు. తను మళ్లీ ఆ షార్ట్‌ను చెక్ కూడా చేయడు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది తన నటన.అది నేను తారక్ దగ్గర నేర్చుకునాన్నను. దాన్ని నేను నా తరువాత చిత్రాల్లో చూపిస్తాను. తన 25 ఏళ్ల కెరీర్లో తారక్‌లో నన్ను నేను చూసుకున్నాను. మా మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. తారక్ కూడా తనలో నన్ను చూసి ఉంటాడు ఎంతోకొంత అని అనుకుంటున్నాను. అలానే తారక్ మంచి చెఫ్ కూడా బిర్యానీ చాలా బాగా చేస్తాడు, తామిందరం మళ్లీ కలిసి సినిమా చేసినా చేయకపోయినా తనకు ఆ బిర్యానీ మాత్రం లైఫ్‌లాంగ్ కావాలంటూ తారక్‌ను కోరాడు. -
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ చేసిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. ఇప్పటికే ట్రైలర్, తదితర ప్రమోషనల్ కంటెంట్ రాగా కాస్త హైప్ పెరిగింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దీనికి హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో పాటు త్రివిక్రమ్,దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్, మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలానే తనకంటే హృతిక్ గొప్ప డ్యాన్సర్ అని పొగిడేశాడు. ఇంకా ఏమేం చెప్పాడంటే?'వార్ 2 సినిమాలో నేను నటించడానికి ముఖ్య కారణం ఆదిత్య చోప్రా గారు. నా వెంటపడి, నాకు భరోసా కల్పించి.. నీ అభిమానులు గర్వపడి తలెత్తుకునేలా చేస్తానని చెప్పారు. ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. మా తాత నందమూరి తారక రామారావు ఆశీసులు ఉన్నంత కాలం నన్ను ఎవరు ఆపలేరు. అలానే నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు అనే వారు కాదు. కానీ హృతిక్ రోషన్‌ని చూసి మ్యాడ్ అయిపోయాను. దేశంలో బెస్ట్ డ్యాన్సర్ ఇతడే' అని తారక్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)''బాద్ షా' ఫంక్షన్ జరిగినప్పుడు ఒక అభిమాని ప్రాణం కోల్పోయాడు. ఆరోజు నుండి పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్నాను. 'వార్ 2' నా బాలీవుడ్ డెబ్యూ మూవీ మాత్రమే కాదు. హృతిక్ రోషన్ టాలీవుడ్ డెబ్యూ కూడా. సౌత్, నార్త్ అనే హద్దులు చెరిపేసిన రాజమౌళికి పెద్ద థాంక్స్. ఇకపోతే ఎవరు ఎన్ని అనుకున్నా బొమ్మ అదిరిపోయింది. పండగ చేసుకోండి' అని ఎన్టీఆర్.. అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. చివరలో తారక్-హృతిక్ తమ కాలర్లు ఎగరేసి సినిమాపై హైప్ పెంచేశారు.ఆగస్టు 14న రాబోతున్న 'వార్ 2' సినిమా.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలు కాగా కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగవంశీ.. తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున రజినీకాంత్ 'కూలీ' కూడా రిలీజ్ అవుతోంది. మరి రెండు చిత్రాల్లో ఏది అభిమానుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'వార్ 2' సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ) -
సినిమా బాగోలేకపోతే పదింతలు నన్ను తిట్టండి: నాగవంశీ
ఎన్టీఆర్ చేసిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటించాడు. ఈ గురవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. అదే రోజున రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' కూడా రిలీజ్ కానుంది. అయితే రజినీ మూవీతో పోలిస్తే 'వార్ 2'కి కాస్త హైప్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు దాన్ని పెంచేలా నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులోనే నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?)'సినిమా చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. చాలా బాగా వచ్చింది. చూసిన తర్వాత ఏ మాత్రం అసంతృప్తిగా అనిపించినా నన్ను పదింతలు తిట్టండి. నన్ను తిట్టడం మీకు అలవాటే కదా. అది అద్భుతమైన చిత్రం అని మీకు అనిపించకపోతే మళ్లీ ఎప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను. తొలిరోజు హిందీ నెట్ వసూళ్ల కంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలి. ఇప్పటివరకు తారక్ అన్న మనం కాలర్ ఎగరేసేలా చేశారు. ఈసారి మనం అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చెయ్యాలి' అని చెప్పుకొచ్చాడు.యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 సినిమా.. ఈ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లో భాగం. తొలి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించగా.. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని నాగవంశీకి చెందిన సితార ఎంటర్ టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకేనేమో నాగవంశీ ఈ రేంజులో తారక్, వార్ 2 చిత్రానికి ఎలివేషన్లు ఇస్తున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
ఎన్టీఆర్ పోటీగా అమీర్ బిగ్ ప్లాన్
-
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్... చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ 'వార్2' ద్వారా దొరికింది. వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. ఆగష్టు 10న వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు బిగ్‌స్టార్స్ వార్2 కోసం ఏకం కావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్'లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
'వార్2'కు పోటీగా 'కూలీ'.. హిందీలో ఆమిర్ బిగ్ ప్లాన్
తమిళంలో విడుదల కానున్న ' కూలీ ' సినిమా హిందీ రిలీజ్ పంపిణీ వ్యవహారాల్లో ఆమిర్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఎకెపి) ప్రతినిధి స్పందించారు. హీందీలో కూలీ సినిమా పంపిణీ వ్యూహంలో ఆమిర్ ఖాన్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఖాన్ అతిధి పాత్రలో మాత్రమే నటిస్తున్నారని తన టీమ్ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో కూలీ సినిమా పంపిణీ విషయంలో ఖాన్, అతని టీమ్ నుంచి ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. మిస్టర్ ఖాన్ ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌కు ఎటువంటి కాల్స్ చేయలేదని తెలిపారు.వార్2 సినిమాకు పోటీగా దేశవ్యాప్తంగా కూలీ ప్రీమియర్ షోలు ప్రదర్శించాలని ఆమీర్ ప్లాన్ చేశాడని, ఈ క్రమంలోనే PVR-Inox CEO అజయ్ బిజ్లీకి నేరుగా ఫోన్ చేసినట్లు ఒక వార్త వైరల్ అయింది. అంతే కాకుండా కూలీ మూవీ కోసం ప్రైమ్ స్లాట్లను ఆయన కోరినట్లు చెప్పుకొచ్చారు. వార్2ను దెబ్బకొట్టేందుకే ఆమీర్ ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో నేరుగా అమీర్ టీమ్ రంగంలోకి దిగింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపింది.కూలీ చిత్రంలో అతిధి పాత్రలో నటించాలని కోరినప్పుడు ఆమీర్ వెంటనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్, రజనీకాంత్‌తో ఆయనకున్న బంధానికి ఇదొక నిదర్శనమని క్లారిటీ ఇచ్చారు. కూలీ, వార్2 రెండు చిత్రాలు ఆగష్టు 14న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్‌ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్‌ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్‌తో ఉన్న బిల్‌బోర్డ్‌ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్‌బోర్డ్‌ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్‌లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
హద్దులు పెట్టుకోదలచుకోలేదు!
‘‘ఇకనుంచి టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఉండేదంతా ఒక్కటే... ‘ఇండియన్ సినిమా’. అందుకే హద్దులు పెట్టుకోదలచుకోలేదు. కథ నచ్చితే సినిమా చేసేస్తా. హిందీ ‘వార్ 2’ ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్. చాలా బలమైన కథ కావడంతో ఈ సినిమా చేశాను’’ అని హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘వార్ 2’ ఈ నెల 14న విడుదల కానుంది. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకోవడానికి గల ముఖ్య కారణం ‘కథ’ అని చెప్పారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ గురించి మాట్లాడారు. ‘‘వారసత్వాన్ని అనుసరించి మీరు హీరోలే అవ్వాలి అని మా అబ్బాయిలతో చెప్పను. ఓ వారధిలా ఉండి ఈ ప్రపంచం గురించి, సంస్కృతుల గురించి వారికి అవగాహన కల్పించాలనుకుంటున్నాను. సొంతంగా అనుభవం సంపాదించుకునే స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు ఆదివారం కూడా షూటింగ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం వారంలో ఒక్క రోజైనా కుటుంబంతో గడపాలని ఫిక్స్ అయి, ఆదివారం దాదాపు సెలవు తీసుకుంటున్నాను. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ల చదువులతో బిజీ అయిపోతారు. దాంతో వాళ్లతో కావాల్సినంత టైమ్ గడపడానికి కుదరదు. అందుకే పండగ లప్పుడు ఇంటిపట్టునే ఉండి, పండగల అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంటా’’ అని పేర్కొన్నారు. -
భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్‌లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అది నా ఫేవరెట్ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్‌తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.నెలంతా షూటింగ్స్‌కే..మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్‌కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్‌కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! వాళ్లకు నచ్చింది చేయనిస్తానా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
'వార్2' వీడియో సాంగ్ .. బికినీతో కియారా
బాలీవుడ్ మూవీ 'వార్2' ఫ్యాన్స్‌కు మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేడు కియారా అద్వానీ పుట్టినరోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ భారీ యాక్షన్ సినిమా నుంచి ఏకంగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో హృతిక్, కియారా అద్వానీల మధ్య క్రియేట్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. హిందీ వర్షన్లో అమితాబ్ భట్టాచార్య రచించిన ఈ సాంగ్‌ను అర్జిత్ సింగ్, నిఖిత ఆలపించగా ప్రీతమ్ సంగీతం సమకూర్చారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో బికినీతో కనిపించిన కియారా పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచేసింది. ఈ సినిమాలో ఆమె తొలిసారి బికినీలో కనిపించనుంది. -
వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర టీమ్.. హృతిక్, కియారాలతో రొమాంటిక్ సాంగ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్‌లుక్ రోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే. -
War 2: మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్న ఆలియా భట్
-
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా బిజీలో ఉన్నాడు. వచ్చే నెల 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ విడుదల చేయగా.. స్పందన బాగానే వచ్చింది. తారక్ అభిమానులకు యాక్షన్ మూవీ చూడబోతున్నామని అంచనాలు పెంచేసుకున్నారు. మరోవైపు ఇతడి ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)అయితే ఈ ఫొటోలు ఎన్టీఆర్‌కి చెందిన జూబ్లీహిల్స్ ఇంటివి అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం.. స్నేహితులతో కలిసి సింపుల్‌గా ఈ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్తగా అమర్చిన వాల్ ఫ్రేమ్స్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ లాంటివి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. చూస్తుంటే తారక్ ఇంటి కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తున్నాడు.'వార్ 2' రిలీజ్‌కి రెడీ కాగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు నెల్సన్.. ఎన్టీఆర్‌తో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు 'దేవర 2' కూడా లైన్లో ఉంది. మరి వీటిలో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్‌ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్‌కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్‌కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్‌కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్‌పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్
-
'వార్2' అతిథి పాత్రలో 'ఆల్ఫా' లేడీ.. సర్ప్రైజ్ చేస్తున్న పోస్ట్
హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం 'వార్ 2'... యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలరను కూడా మేకర్స్ పంచుకున్నారు. అయితే, వార్ 2 ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ షాకిచ్చింది. థియేటర్లో కలుద్ధాం అంటూ సడెన్‌గా సర్ప్రైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తున్నట్లు ఎక్కడే కాని వార్తలు రాలేదు. తొలిసారి ఆమె ఇలా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.అలియా భట్ తాజాగా చేసిన పోస్ట్‌ను గమనిస్తుంటే వార్ 2లో ఆమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా రహస్యంగా ఆమె పాత్రను చిత్రీకరణ చేసినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ, ఇదంతా ఆమె తర్వాతి చిత్రం 'ఆల్ఫా'తో వార్2 లింక్ ఉంటుందని టాక్.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో (Alpha) అలియా గురువు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు కూడా గతంలో తెలిపాయి. వార్2లో అలియా నటిస్తున్నట్లు అధికారికంగా ఏమీ ధృవీకరించబడనప్పటికీ ఆమె చేసిన పోస్ట్‌తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆల్ఫా చిత్రాన్ని శివ్ రావేల్ దర్శకత్వంలో రానుంది. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుంది. -
ఆస్ట్రేలియా ప్రజల్ని హడలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
గత కొన్నేళ్లలో చూసుకుంటే పలు దేశాల మధ్య యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా థాయ్ ల్యాండ్, కంబోడియా మధ్య ఓ దేవాలయం విషయమై పెద్ద గొడవే జరుగుతుంది. ఎక్కడికిక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఎవరైనా మీరు నివసించే ప్రదేశంలో 'వార్' అని రాస్తే ఎలా ఉంటుంది. గజగజ వణికిపోతారు కదా! ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అలాంటిదే జరిగింది.ఇంతకీ ఏంటి విషయం?గురువారం ఉదయం ఆస్ట్రేలియాకు చెందిన ఓ నెటిజన్.. తాను నివసించే మెల్బోర్న్లో ఆకాశంలో ఎవరో 'వార్ 2' అని రాశారని, దీని గురించి ఎవరికైనా తెలుసా? అని ట్వీట్ చేశారు. రిప్లై ఇచ్చిన మరో నెటిజన్.. 'తమ అభిమాన హీరో ఎన్టీఆర్ కొత్త సినిమా 'వార్ 2'ని ప్రమోట్ చేసేందుకు ఇలా ప్రేమ చూపించాం' అని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సదరు నెటిజన్.. 'సడన్‌గా ఆకాశంలో వార్ అని రాస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి' అని తన భయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'మంచు వారి పప్పు'.. మోహన్ బాబు స్పెషల్ రెసిపీ)పాపం ఆస్ట్రేలియా ప్రజలు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఈ పని వల్ల తెగ భయపడిపోయారు. 'వార్ 2' సినిమా గురించి మనవాళ్లకు తెలుసు. కాబట్టి ఇక్కడా ఇలా రాసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ దేశం కానీ దేశంలో ఇలా అభిమానం చూపించేసరికి అక్కడి ప్రజలు నిజంగా యుద్ధం ఏమోనని తెగ భయపడిపోయారు. చెప్పాలంటే వణికిపోయింటారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.'వార్ 2' విషయానికొస్తే.. ఎన్టీఆర్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ. యష్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజీలో తీస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో కాగా, ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్.. 'వార్ 2' ట్రైలర్ రిలీజ్)We, the fans, showering our love on our demigod @tarak9999 by promoting the movie #War2 which is releasing on August 14. #War2Trailer— Agent Vikram Reddy (@Vikram2892) July 24, 2025Can you imagine, we the civilian, seeing War written in the sky on a random day?— benyamin (@bbap53) July 24, 2025 -
మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్
కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవాడు. 'రాఖీ' సినిమాలో తారక్ రూపంపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి 'యమదొంగ' కోసం పూర్తి సన్నగా మారిపోయాడు. అప్పటినుంచి దాదాపు ఒకేలాంటి లుక్ మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సినీ కెరీర్లో రెండోసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్గన్'.. సడెన్‌గా తెలుగు స్ట్రీమింగ్)దాదాపు ఏడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా 'అరవింద సమేత'. ఈమూవీ కోసం సిక్స్ ప్యాక్ చూపించాడు. షర్ట్ లేకుండానే తారక్ ఇంట్రో ఫైట్‌లో కనిపించాడు. అంతకు ముందు 'టెంపర్'లోనూ సిక్స్ ప్యాక్ చూపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి సిక్స్ ప్యాక్ చేశాడు. అదీ బాలీవుడ్ సినిమా కోసం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్.. హిందీలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే 'వార్ 2'.యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో తీసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్-తారక్ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ట్రైలర్లోనే తారక్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు. ఇదే ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ ఇస్తోంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్) -
వార్ 2 ట్రైలర్ విడుదల
-
ఎన్టీఆర్, హృతిక్ మధ్య 'వార్ 2'.. ట్రైలర్ వచ్చేసింది
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ సినిమా వార్2 ట్రైలర్ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ రాబోతోంది. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం ఎలా ఉండబోతుందో ట్రైలర్లో చూపించారు. కియారా అద్వానీ కూడా యాక్షన్ ఎపిసోడ్స్‌లతో పాటు గ్లామర్ రోల్లో కనిపించనున్నారు.ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతోగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ కానుందని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. -
అద్భుత పోరాటం
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. -
కౌంట్ డౌన్ స్టార్ట్
‘‘వెండితెరపై యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసానికి ‘వార్ 2’’ సిద్ధం అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానుంది.‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఓపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీపాత్రల్ని చూపించేలా డిజైన్ చేశారు. ‘‘యాక్షన్ ఓరియంటెడ్ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం ‘వార్ 2’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సితారకు వార్ 2
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ కానుంది’’ అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. -
వార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
థియేటర్స్‌లో ‘వార్ 2’కి యాభై రోజుల కౌంట్‌డౌన్ మొదలైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్‌లో నటించిన స్పై యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిల్మ్స్)’ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్ 2’ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కాగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీల పోస్టర్స్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. అలాగే ‘వార్ 2’ సినిమాను ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా కూడా మేకర్స్ తెలిపారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించనున్నాం’’ అని తెలిపారు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా. ‘‘యాక్షన్’ చిత్రాలకే ‘వార్ 2’ సినిమా ఓ పాఠంలా ఉంటుంది. ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఐమ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు’’ అని పేర్కొన్నారు ఐమ్యాక్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ టిల్లా్మన్. -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్‌బస్టర్ వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
దిల్ రాజు చేతికి 'వార్ 2'.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.వార్2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజ్ ఫిలింస్ కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్‌ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వార్2కు పోటీ తప్పదు. అందుకే వార్2 చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ, ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్ పక్కన పెట్టేసింది. -
లక్ష్యం కోసం...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ‘వార్ 2’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.ఈ టీజర్లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్ 2’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అనైతా ష్రాఫ్ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్‌కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్ అందరిలోకి వచ్చేస్తుంటుంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్‌ని డిజైన్ చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్ అడజానియా చెప్పారు. -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్‌లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హృతిక్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్‌ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్
‘‘వార్ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందిస్తూ– ‘‘వార్ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా
-
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
'వార్ 2' మొదలైంది.. టీజర్లో ఈ షాట్స్ గమనించారా? (ఫోటోలు)
-
ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. తారక్‌ను ప్రధానంగా హైలెట్ చేస్తూ వీడియో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో తారక్ కిల్లర్ బాడీకి హృతిక్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్‌ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్‌ను చూస్తే భారీ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్‌నే డబ్బింగ్ చెప్పాడు.ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు.వార్తో ‘ఎన్టీఆర్ నీల్’కు బ్రేక్ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘వార్ 2’ నుంచి అప్డేట్ రావడంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్ని పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్
-
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్‌లపై అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025 -
జా.ఎన్టీయార్, హృతిక్‌ల వార్2 వసూళ్లు.. రూ.100కోట్లు..
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో ఎన్టీఆర్(Jr NTR) జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2‘(War 2) విడుదల కాకముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీయార్ ల అనూహ్య కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైన నాటి నుంచే సంచలనంగా మారింది. ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ ’కబీర్’గానే స్క్రీన్ మీదకి రానుండగా, మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్రహీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగానూ బాలీవుడ్, టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ‘వార్ 2‘ పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి దక్షిణాది వ్యాప్తంగా ఈ సినిమా హైప్‌కి ప్రధాన కారణం జూ.ఎన్టీఆర్ కి ఇటీవలి కాలంలో అమాంతం పెరిగిన క్రేజ్ అనేది నిస్సందేహం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ హవా ఇటీవల రెట్టింపైంది. ఆర్ఆర్ఆర్, దేవర...ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడమే సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో విడుదలకి ముందే ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైపోవడం ఓ రికార్డ్‌గా చెప్పాలి. తద్వారా ఈ సినిమా భారత మూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్‌కి కొబ్బరికాయ కొట్టినట్టయింది. భాషా అంతరాలను దాటి స్టార్ హిరోల క్రేజ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలకి పెరిగిన ఆదరణ కారణంగా ఇటువంటి డీల్స్ ముందుగానే ఖరారవడం ఇక షురూ కావచ్చు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగా వంశీ, సునీల్ నారంగ్ ఈ లాభదాయకమైన డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి మూడేళ్లు ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో ఆగస్టు 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఓపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్ హారిస్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు బాడీ డబుల్ (డూప్)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.అలా ఆర్ఆర్ఆర్లో అవకాశంఅతడు మాట్లాడుతూ.. జార్జ్ రెడ్డి సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్‌చరణ్ ఫ్రెండ్‌గా నటించాను. అయితే ఎడిటింగ్‌లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాగే ఉన్నావ్ అన్నాడు. రాజమౌళి టీమ్ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలో భాగమయ్యాను.కొమురం భీముడో పాటలో..ఉదయం 6 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్ నావే ఉంటాయి. తారక్ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్‌లాంటివైతే నేనేం చేయలేదు.వార్ 2 కోసం అడిగారుమొన్న వార్ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్‌గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్.. జెప్టో యాడ్ కూడా చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సింగిల్ టేక్‌లో చాలా సింపుల్‌గా నటిస్తాడు.జెప్టో యాడ్ చేశా..అయితే యాడ్ షూటింగ్ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్లో ఉన్నాడు. అసలే వార్ 2లో హృతిక్ రోషన్‌ను మ్యాచ్ చేయాలి కదా మరి! హృతిక్‌ను మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్‌లో క్యారవాన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్‌గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwar_harris) చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి -
మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్
'దేవర' కోసం లెక్క ప్రకారం ఎన్టీఆర్(NTR) రావాలి. కానీ ఆ రోజు అభిమానుల తాకిడి వల్ల ఈవెంట్ జరగలేదు. దీంతో తారక్ మరో ఫంక్షన్ వచ్చే అవకాశం చాన్నాళ్ల తర్వాత మొన్న జరిగింది. ఇప్పుడు మరోసారి తన సోదరుడు కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైదరాబాద్ లో జరిగిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'(Arjun Son Of Vyjayanthi Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నయ్య కల్యాణ్ రామ్ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలానే విజయశాంతి గారు మాట్లాడుతుంటే నాన్న లోటు లేనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు.ఈ ఆగస్టు 14న తాను నటించిన 'వార్ 2'(War 2 Movie) విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. మళ్లీ ఎప్పుడు కనబడతానో లేదో.. ఓసారి తనివితీరా మాట్లాడనివ్వండి అని అభిమానులని ఉద్దేశించి ఇదే ఈవెంట్ లో మాట్లాడాడు. దీనిబట్టి చూస్తుంటే 'వార్ 2' కోసం తప్పితే ఈ మధ్యలో ఎక్కడా తారక్ కనిపించడనమాట.(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ రిలీజ్) -
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్ రోషన్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్ 2 ఈవెంట్లో హృతిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్‌తో డ్యాన్స్..జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ కోస్టార్. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్ 2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్‌గానూ..హృతిక్ రోషన్ నెక్స్ట్ 'క్రిష్ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్ తండ్రి రాకేశ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్ -
బ్లాక్ బస్టర్ లోడింగ్
-
అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ
కొన్నిరోజుల నుంచి అనుకున్నదే జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' (Coolie Movie).. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు పోటీగా నిలిచింది. సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడని సమాచారం. ఇదివరకే షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. ఆగస్టు అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి అన్ని పనులు అంతలోపు పూర్తి చేస్తారు.మరోవైపు ఆగస్టు 14నే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2 Movie) రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. నార్త్ లో దీనికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు గానీ దక్షిణాదిలో మాత్రం 'కూలీ' పోటీ గ్యారంటీ. తొలుత కూలీ వారం లేటుగా రావొచ్చేమో అన్నారు కానీ లాంగ్ వీకెండ్ దృష్ట్యా ఆగస్టు 14నే వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రజినీ vs తారక్ ఖరారైంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/KU0rH8kBH7— Sun Pictures (@sunpictures) April 4, 2025 -
అఫీషియల్: అనుమానాల్లేవ్.. చెప్పిన టైంకే 'వార్ 2'
ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ మూవీ 'వార్ 2'. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. మొన్నీమధ్యే డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తూ హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ వీటికి చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. మరోసారి తేదీపై క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్.. ఓ 'అద్దె ఆటగాడు'?)'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తారక్.. గతేడాది 'దేవర'గా వచ్చాడు. ఈ ఏడాది 'వార్ 2'తో రాబోతున్నాడు. తాజాగా ట్విటర్ లో ఓ మీమ్ పేజ్.. ఈ మూవీ కోసం వీడియో చేసింది. దీనికి రిప్లై ఇచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్.. ఆగస్టు 14న 'వార్ 2' థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో తొలుత 'ఏక్ థ టైగర్'(2012) వచ్చింది. దీని కొనసాగింపుగా 'టైగర్ జిందా హై' (2017), 'వార్' (2019), 'పఠాన్'(2023) వచ్చాయి. వీటిలో భాగమైన 'వార్ 2'.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది క్రిస్మస్ కి ఈ యూనివర్స్ లో భాగమైన 'ఆల్పా' కూడా విడుదల కానుంది.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)Must say… you have set it up brilliantly even before we have started our marketing of #War2 🔥😎💥😱💪 ... there will be mayhem in cinemas on 14 August 2025, worldwide… 😈⚠️‼️🚨🤯 https://t.co/eVmQRLLJtG— Yash Raj Films (@yrf) March 16, 2025 -
ఎన్టీఆర్ వార్ 2 అప్డేట్ బాలీవుడ్ షేక్ కావాల్సిందే!
-
బ్యాడ్ న్యూస్ ఇప్పట్లో వార్ 2 రిలీజ్ కష్టమే..!?
-
'వార్2'లో గాయపడిన స్టార్ హీరో.. సినిమా వాయిదా..!
'వార్2' విడుదల కోసం పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్, హృతిక్ రోషన్ మధ్య ఒక సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ గాయపడినట్లు బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్‌ను మేకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్‌ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?
'దేవర' తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు చేస్తున్నాడు. హిందీలో 'వార్ 2', ప్రశాంత్ నీల్ తో మరో మూవీతో బిజీగా ఉన్నాడు. తాజాగా తారక్ నటించిన ఓ డెలివరీ పోర్టర్ యాడ్ రిలీజైంది. అయితే అందులోని కంటెంట్ ఎంత రీచ్ అయ్యిందో లేదో తెలీదు గానీ తారక్ లుక్ గురించి ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.ఈ మధ్య కాలంలో తారక్ సన్నబడినట్లు ఉన్నాడు. 'వార్ 2' కోసం డిఫరెంట్ లుక్ మెంటైన్ చేస్తున్నాడు. ఒకవేళ యాడ్ లోనూ అదే లుక్ తో ఉంటే కష్టం కాబట్టి క్రాఫ్ కాస్త మార్చినట్లున్నారు. అలా తారక్ డిఫరెంట్ గా కనిపించాడు. దీంతో అలా ఉన్నాడు ఇలా ఉన్నాడంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))ఇలా కనిపించిన ప్రతి కంటెంట్ ని ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఆ హీరో ఈ హీరో అనేం లేదు. ప్రతిఒక్కరూ దీనిబారిన పడ్డవాళ్లే! ఇప్పుడు తారక్ నటించిన యాడ్ కి కూడా ఈ సెగ తగిలిందని చెప్పొచ్చు.ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. వార్ 2 ఆగస్టు 14న రాబోతుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కి తారక్ హాజరవుతాడు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ చేస్తారా లేదా లేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)) -
ఆ 3 సినిమాలూ పుష్ప-2 కి పోటీ? ఎన్టీఆర్ - బన్నీ ఫైట్
అల్లు అర్జున్ మాస్ తాండవం చేసిన పుష్ప 2: రూల్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. తెలుగు సినిమా సత్తాను విశ్వవ్యాప్తంగా చాటింది. సుకుమార్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ చిత్ర నార్త్ సర్క్యూట్లో కలెక్షన్ల ఎర్త్‌క్వేక్స్ సృష్టించింది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర పోగుపడిన అన్ని రికార్డులను తుడిచిపెట్టింది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి రాబోయే సంచలన చిత్రాలకు పుష్ప 2 సెట్ చేసిన బెంచ్ మార్క్ రూ. 857.50 కోట్ల గ్రాస్. దీంతో ఈ అంకెను క్రాస్ చేసే సినిమా ఏది కావొచ్చనే అంశంపై ఆసక్తితో పాటు స్పెక్యులేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి.పుష్ప2 రికార్డ్ బ్రేక్ చేయగలవు అనే అంచనాలున్న సినిమాలుగా ట్రేడ్ విశ్లేషకులు మూడింటిని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. అవేమిటంటే... వార్- 2, కాంతార- 2, హేరా ఫేరి -3 ... ఈ మూడింటిలో ఒకటి లేదా 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని తుడిచిపెట్టగలవని అంచనా వేస్తున్నారు.సీక్వెల్‌తో సీక్వెల్‌పై యుద్ధం..పుష్ప 2కు ప్రధాన పోటీదారుగా ఉన్న వార్- 2 సినిమా ఉత్తరాది, దక్షిణాది నుంచి ఇద్దరు సూపర్‌స్టార్స్ నటించిన చిత్రం కావడం విశేషం. నార్త్ నుంచి హృతిక్ రోషన్ సౌత్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ఖచ్చితంగా పుష్ప2ని మించే అవకాశాలున్నాయని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 2025లో అత్యంత హైప్ చేయబడిన చిత్రం. స్పై యాక్షన్ డ్రామా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుంటోంది. వార్ 2 హిట్ అయితే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తదుపరి రూ.1000 కోట్ల గ్రాసర్‌గా నిలవడం ఖాయం. అలాగే నార్త్‌లోనూ రికార్డ్స్ బద్ధలవ్వొచ్చు. అదే జరిగితే టాలీవుడ్ హీరోల్లో బన్నీ మీద ఎన్టీయార్‌పై చేయి సాధించినట్టు కూడా అవుతుంది.కాంతారా... కలెక్షన్ల జాతరా?అదే సమయంలో కాంతారా ద్వారా అఖిల భారత స్థాయిలో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కూడా ఈ ఏడాదిలోనే విడుదలవుతోంది. వార్- 2 స్థాయిలో స్టార్స్ లేనప్పటికీ... తొలి భాగం సాధించిన భారీ విజయంతో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ ఆసక్తికి తగ్గట్టుగా కాంతారా తగిన బజ్ క్రియేట్ చేస్తే... తప్పకుండా పుష్ప రికార్డులపైకి గురి పెట్టొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన ఈ చిత్రం కూడా హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందితే 1000 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.కామెడీతో కొట్టగలరా?బాక్సాఫీస్ పందెం కోళ్లలో పుష్ప-2కి మూడవ అతిపెద్ద పోటీ హేరా ఫేరి 3.. ఈ కల్ట్ కామెడీ మూడవ భాగం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది. ప్రియదర్శన్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు ధృవీకరించారు. అయితే ఈ సినిమా ఎంత బాగా తీశారు అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. మరోవైపు గత కొంత కాలంగా మంచి క్వాలిటీ కామెడీ ఎంటర్టైనర్ల కోసం ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ప్రియదర్శన్ హేరా ఫేరి బృందం దానిని అందించడంలో విజయవంతమైతే, ఈ చిత్రం ఇప్పటికే ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయవచ్చు.అంత ఈజీ కాదు...అయితే ఏది ఏమైనప్పటికీ, పుష్ప 2 హిందీ బాక్సాఫీస్ రికార్డులను సవాలు చేయడం మాత్రం రాబోయే ఏ చిత్రానికి అంత సులభం కాదనేది నిజం ఎందుకంటే థియేటర్లలో అల్లు అర్జున్ సినిమా దాదాపు రెండు నెలలు నడిచింది, పెద్ద సినిమా ఏదీ దీనికి రోడ్‌బ్లాక్‌గా మారలేదు. పైన పేర్కొన్న సినిమాలు మార్కెటింగ్ ప్రమోషనల్ కార్యకలాపాలతో హైప్‌ను కొనసాగించగలిగితే, కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించడంతో పాటు కనీసం 6 వారాల పాటు క్లీన్ ఫ్రీ థియేట్రికల్ ర¯Œ ను పొందగలిగితే, అవి పుష్ప 2 చారిత్రక రికార్డుకు ముప్పు తప్పదు. పై మూడింటితో పాటు ఇంకా పేరు పెట్టని అట్లీ–సల్మాన్ ఖాన్ చిత్రం రణబీర్ కపూర్ నటించిన రామాయణం, యానిమల్ పార్క్ బాక్సాఫీస్ రికార్డ్స్‌పై కన్నేశాయి. ఇవి కూడా పుష్ప 2 యొక్క హిందీ కలెక్షన్లను బద్దలు కొట్టగల శక్తి ఉన్నవేనని చెబుతున్నా -
ఎన్టీఆర్ వార్ 2 పై ఆశలు పెట్టుకున్న కియారా
-
బాలీవుడ్లో ఎన్టీఆర్.. నాటు నాటు పాట రిపీట్?
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ఎంత హిట్టో తెలియంది కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకెత్తయితే ఆ ఒక్క పాట ఒకెత్తు అన్నట్టుగా భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఆ పాట దునియాని ఊపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పాట ఓ రేంజ్లో పాప్యులరైంది. అదే ఊపులో ఇండియాకి ఆస్కార్‌ని కూడా తెచ్చేసింది. మరోసారి ఈ తరహా పాట రిపీట్ కానుందా? అందులో మన యంగ్ టైగర్ తన కాలు కదపనున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న భారీ చిత్రం వార్ 2 చిత్ర విశేషాలను గమనిస్తున్నవారు దీనిని దాదాపుగా ధృవీకరిస్తున్నారు. తొలిసారిగా ఎన్టీయార్ వార్ -2లో నటిస్తుండటంతో ఈ పాన్ ఇండియా సినిమాపై తెలుగు, హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మన ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.హృతిక్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశం స్పెషల్‌గా ఉండాలని కాబట్టి తప్పకుండా తగినన్ని యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అందరూ భావిస్తున్నారు. మరోవైపు నాటునాటు పాట తరహాలో ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట. బాలీవుడ్లో హృతిక్ నృత్యాలకు కూడా మంచి పేరుంది. మరోవైపు ఎన్టీయార్ డ్యాన్సుల గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో సాంగ్ అనే ఆలోచన నిజమైతే... ఇక ప్రేక్షకులకు కన్నుల పండుగే అని చెప్పాలి. ఇటీవల హృతిక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం పెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు. . ఆయనతో పాటుగా స్టెప్స్ వేయాలంటే మరింతగా ప్రిపరేషన్ అవసరం అని అభిప్రాయపడ్డాడు. .ఈ సినిమాలో పాట నాటు నాటు పాట కంటే హై లెవెల్లో ఉండేలా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.మరోవైపు తొలిసారిగా ఒక అగ్రగామి తెలుగు హీరో...విలన్ తరహా పాత్రను బాలీవుడ్లో పోషిస్తుండడంతో వార్ 2 సినిమా చర్చనీయాంశంగా మారింది: ఇందులో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. అటు డ్యాన్స్, ఇటు యాక్షన్‌లో హృతిక్‌తో పోటీ పడాల్సిన ఈ పాత్రకు ఎన్టీఆర్ పూర్తి న్యాయం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ 2 విడుదలకు సంబంధించి ఇంకా స్పష్టత రానప్పటికీ... ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది సంచలనాత్మక సినిమాల్లో వార్ -2 ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి బాలీవుడ్, టాలీవుడ్ పూర్తి స్థాయి మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్, టాలీవుడ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మల్టీ జానర్ సినిమా చేయబోతుండగా, మరోవైపు దేవర 2 కూడా లైన్లో ఉంది. -
హృతిక్, జూ.ఎన్టీయార్ల మధ్య ‘వార్’కి టైమ్ బాగుందట!
ప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయర్ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.బాలీవుడ్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్ చంద్రరమణి హృతిక్ జ్యోతిష శాస్త్ర చార్ట్‌ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ తన కెరీర్లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్–టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కహో నా... ప్యార్ హై’ (2000) సమయంలోనూ హృతిక్ విజయంలో వీనస్ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్ అంటున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా హృతిక్‌కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్ వ్యక్తిగత వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే అవకాశం ఉందనీ, జనవరి ఫిబ్రవరిలో రియల్ ఎస్టేట్, స్టాక్‌లు లేదా ప్రైవేట్ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు. బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. హృతిక్ గత చిత్రాలలో ’వార్’ (2019) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ’విక్రమ్ వేద’ (2022), ’ఫైటర్’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి. మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్ రోషన్ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో, ఆయనకు ఇది మరో విజయవంతమైన సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానున్న వార్ 2 హిందీ సినిమాల్లో రికార్డ్–బ్రేకింగ్ ఓపెనర్‌గా అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న జూ.ఎన్టీయార్(Jr NTR) బాలీవుడ్ కెరీర్ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది. -
ఢీ అంటే ఢీ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మాసీ సాంగ్‌ను ముంబైలో వేసిన ఓ సెట్లో చిత్రీకరించారని బాలీవుడ్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.డిసెంబరు రెండో వారంలో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ అన్నట్లు ఫైట్ చేస్తారట. ఇది క్లైమాక్స్ ఫైట్ అని, దాదాపు పదిహేను రోజుల పాటు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని, ఈ ఫైట్ కోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారని టాక్. ఆదిత్యా చో్రపా నిర్మిస్తున్న ‘వార్ 2’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఐ యామ్ లెజెండ్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. -
యుద్ధానికి సిద్ధం
‘వార్’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర:పార్ట్ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్ సూచించారట.ఇక ఎన్టీఆర్ మాత్రం ‘వార్ 2’ చిత్రం షూట్లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్లో ‘వార్ 2’ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్ షెడ్యూల్స్‌లో హృతిక్–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించారు మేకర్స్. అయితే ‘దేవర:పార్ట్ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ‘వార్ 2’ షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది యూనిట్. ఈ షెడ్యూల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. -
డ్యాన్స్ టైమ్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతారు. హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తారు. మరి... ఈ ఇద్దరూ కలిసి ఓపాటకు డ్యాన్స్ చేస్తే థియేటర్స్ దద్దరిల్లేలా ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్ 2’ అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓపాట ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.ఈపాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డ్యాన్స్ అంటూ... ఈ నెల మూడో వారంలో ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో ఈపాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ ఈ సాంగ్‌కు స్టెప్స్ సమకూర్చనున్నారని భోగట్టా. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
హైదరాబాద్‌లో యుద్ధం
హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వారిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్ రోషన్ పాల్గొన్నారు. కాగా ‘వార్ 2’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు.ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్–హృతిక్‌లపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్లో వచ్చే ఈ ఫైట్ సినిమాలో ఓ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ని యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది. కాగా 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024 -
బాలీవుడ్‌నూ మడతెట్టేశాడుగా.. దటీజ్ తారక్
-
షూటింగ్... పార్టీయింగ్...
ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు బాలీవుడ్ స్టార్స్‌తో పార్టీల్లో సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీ చిత్రీకరణ కోసం అక్కడే ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’ షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్న ఆయన పార్టీలనూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ పార్టీలో బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. పార్టీ జరుగుతున్న హోటల్ వద్దకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్‌తో ఫొటోల కోసం వారు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ లేడీ ఫ్యాన్ అయితే.. ‘ఎన్టీఆర్ సార్.. ఈ రోజు నా బర్త్ డే.. మీతో సెల్ఫీ దిగాలని ఉంది’ అంటూ రిక్వెస్ట్ చేయడంతో.. ఆమెతో ఫొటో దిగారు ఎన్టీఆర్. ఇక హిందీలో ‘వార్ 2’తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. -
వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు.. అర్థం చేసుకోరే?
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. అటు కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాతో పాటు ఇటు బాలీవుడ్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ కోసం తారక్ తరచూ ముంబై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో తాజా షెడ్యూల్ కోసం మరోసారి ముంబై వెళ్లారు. హీరోను చూడగానే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఆయన స్టార్ హోటల్లో బస చేసేందుకు వెళ్తుంటే వెంబడించి వీడియో తీశారు.ఓయ్..ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న తారక్.. తనను ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించి ఓయ్.. అని పిలుస్తూ తనను క్లిక్మనిపించొద్దని అభ్యర్థించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా తారక్ ఎంతో సరదాగా ఉంటారు. ఆయనకు అంత ఈజీగా కోపమనేది రాదు. సినిమా కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వార్ 2 కోసం కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తన మేకోవర్‌ను సైతం మార్చేశారు. ఇది అర్థం చేసుకోలేని కొందరు ఆయన అనుమతి కూడా తీసుకోకుండా తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో అలా చేయొద్దని తారక్ సదరు కెమెరామన్లను వారించారు. తన లుక్ లీక్ కావొద్దని ఆయన ఇంతలా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.వార్ 2 కోసంకాగా వార్ 2 కోసం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 60 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారు. తొలి భాగాన్ని మించిపోయేలా హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్లు ప్లాన్ చేస్తున్నారట! ఈ పోరాట సన్నివేశాలను ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేసినట్లు భోగట్టా! ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Total फ़िल्मी (@totalfilmii) చదవండి: బాలీవుడ్ ఎంట్రీ.. కీర్తి చూశారా? అప్పుడే ఎలా మారిపోయిందో! -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్‌లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్‌గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
వార్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. కొత్త లుక్ ఫోటోలు వైరల్
బాలీవుడ్ ‘వార్’లో అడుగుపెట్టేశారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయనే విషయం తెలిసిందే.. హృతిక్‌రోషన్‌కు సంబంధించిన చాలా సీన్లు మేకర్స్ చిత్రీకరించేశారు. తాజాగా తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. వార్2 కోసం ఎన్టీఆర్ 60రోజులు కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హృతిక్, తారక్ మధ్య వచ్చే భారీ యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిద్దరు కలిసి మొత్తంగా 30 రోజుల పాటు కలిసి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 అక్టోబర్ 10న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తారక్ వచ్చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by ɴᴛʀ ғᴀɴs ᴄʟᴜʙ™ (@ntrloversoffl) -
వార్‌కు రెడీ!
బాలీవుడ్ ‘వార్’కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతోంది. ‘వార్’కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ‘వార్ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే ‘వార్ 2’ చిత్రీకరణ మొదలైందని, హృతిక్‌రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో ‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. ‘వైఆర్ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్ 2’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వార్ 2 కోసం ఎన్టీఆర్ వందకోట్ల పారితోషికం ?
-
సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?
హిందీ చిత్రం ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్ 2’ మల్టీస్టారర్ మూవీ అనే విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. -
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ -2 చిత్రంపై కీలక అప్డేట్
ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైమ్ కూడా ఉండదేమో అని తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. వార్ 2 లో ఈ సారి హృతిక్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట. గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ప్రధాన కారణం తారక్ ఫిబ్రవరి, మార్చి నెలలో వార్ 2 చిత్రం కోసం డేట్స్ కేటాయించడమే అని తెలుస్తోంది. ఈ చిత్రం డార్క్ థీమ్‌లో ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. -
వార్ 2 నుండి కిక్కెక్కించే న్యూస్
-
ఎన్టీఆర్ విలన్ పాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉంది
-
హృతిక్ రోషన్‌కు తీవ్ర గాయాలు.. జూ ఎన్టీఆర్ 'వార్- 2' మరింత ఆలస్యం
ప్రముఖ బాలీవుడ్ కథా నాయకుడు హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఆయన తెలిపారు. నడుముకు ఒక బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో నిలుచున్న ఒక ఫోటోను ఆయన షేర్ చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్, వీల్ చైర్ అవరసమెచ్చింది..? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి..? అని రాసుకొచ్చారు. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. ఈ క్రమంలో టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి స్టార్స్‌తో పాటు అభిమానులు మెసేజ్‌లు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఫోటోలో హృతిక్ రోషన్‌ను గమనిస్తే ఆయనకు తీవ్రమైన గాయాలే అయినట్లు ఉన్నాయి. అందుకు గల కారణాలను మాత్రం ఆయన తెలపలేదు. ఫైటర్ షూటింగ్ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కాలికి గాయం కావడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రం వార్-2 షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. 'వార్' మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో 'వార్2'పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలో షూటింగ్ అనుకుంటున్న సమయంలో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 'ఫైటర్' సినిమాతో హిట్ కొట్టారు హృతిక్ రోషన్. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొణె ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్లో ఇప్పటికి కూడా రన్ అవుతుంది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
వార్ 2తో బాలీవుడ్ రేంజ్ నెక్స్ లెవెల్ కి కానీ !
-
Jr ఎన్టీఆర్ వార్2 మూవీ అప్డేట్
-
అందుకే పోస్ట్ పోన్ అయిన వార్ -2
-
War-2 Movie: హృతిక్ రోషన్- ఎన్టీఆర్ వార్-2 రిలీజ్ ప్రకటన వచ్చేసింది
హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'వార్'. 2019లో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ సినిమా భారీ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'వార్2' వస్తుంది. 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగష్టు 14న వార్ 2 విడుదల అవుతుందని ప్రకటించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తోన్న ఆరో సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. 2024 జనవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై వెంటనే ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ప్రారంభించాల్సి ఉంది. 2025 ఆగష్టులో వార్-2 ఉండటంతో పాన్ ఇండియాలో తారక్ క్రేజీ భారీగా పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. #War2 gets one of the best possible release date in 2025 with plenty of Holidays. Aug 14th - Release Day Aug 15th - Independence Day Aug 16th - Janmashtami Aug 17th - Sunday Aug 22nd To 24th Weekend 2 Aug 27th -… pic.twitter.com/GBSSlE8t1A — Manobala Vijayabalan (@ManobalaV) November 29, 2023 -
వార్ 2 కోసం ఎన్టీఆర్ కొత్త ప్లాన్ అదుర్స్..!
-
వార్ 2 కి అడ్డు వస్తున్న దేవర..
-
ఏప్రిల్‌లో సెట్స్‌కి...
వరుస సినిమాలతో మరింత బిజీ కానున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి ΄ార్ట్ షూటింగ్ డిసెంబరు కల్లా పూర్తవుతుందని, అప్పట్నుంచి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోని ‘వార్ 2’ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ్ర΄ారంభం కానుందని యూనిట్ వెల్లడించింది. -
వార్ 2 స్టోరీ లైన్ మామూలుగా లేదు..
-
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. మధ్యలో కియారా!
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత సినిమాలకు భాషతో సంబంధం లేకుండా పోయింది. మన ప్రేక్షకులైతే అదీ ఇదీ అని తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని మూవీస్ చూసేస్తున్నారు. మన హీరోలు కూడా తెలుగు వరకు మాత్రమే పరిమితమైపోకుండా ఎక్కడ ఛాన్స్ వస్తే ఆ భాషల్లో నటించేస్తున్నారు. అలా తారక్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. 'ఆర్ఆర్ఆర్'లో నటించి, మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జూ.ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. నవంబరులోపు దీని షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని టాక్. ఇది పూర్తయిన వెంటనే తారక్.. బాలీవుడ్ లో 'వార్ 2'లో నటించబోతున్నాడు. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది పక్కా ఇన్ఫర్మేషన్ అని సమాచారం. యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ లో 'వార్-2' మూవీ ఒకటి. తొలి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించగా.. సీక్వెల్ లో మాత్రం హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో హృతిక్ కు హీరోయిన్ గా కియారా అడ్వాణీని ఎంపిక చేశారని అంటున్నారు. అధికారికంగా చెప్పనప్పటికీ ఇదే నిజమనిపిస్తోంది. మరి ఎన్టీఆర్ సరసన ఏ హీరోయిన్ చేయనుందో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కియారా ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తోంది. Into the Spy Universe!🎬❤️#KiaraAdvani will reportedly join #HrithikRoshan and #JrNTR in #War2. pic.twitter.com/UfQBs8irjp — Filmfare (@filmfare) June 17, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
అదిరిపోయిన ప్రశాంత్ నీల్ ప్లానింగ్?
-
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
ఎన్టీఆర్ డాన్స్ తో పోటీపడుతున్న హృతిక్
-
యుద్ధ భూమిలో కలుద్దాం తారక్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ బర్త్‌డే నేడు(మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాత్రం అందరికంటే కాస్త భిన్నంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశాడు. (చదవండి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!) త్వరలోనే వీరిద్దరు వార్ 2 చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని హృతిక్ పరోక్షంగా తెలియజేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే తారక్. ఈ ఏడాది మరింత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధ భూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంతవరకు నీ ప్రతి రోజు సంతోషంగా, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. అంతేకాదు చివర్లో ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగు టచ్ కూడా ఇచ్చాడు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఇక వార్ 2 విషయానికొస్తే.. యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace …until we meet 😉 Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻 — Hrithik Roshan (@iHrithik) May 20, 2023 -
ఎన్టీఆర్ v/s చియాన్ విక్రమ్...సత్తా చాటేదెవరు?
-
మరోసారి విలన్‌గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే..
ఎన్టీఆర్‌లో నెగటివ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపించిన చిత్రం ‘జై లవ కుశ’. ఆ చిత్రంలో ‘జై’ పాత్రలో విలన్‌గా విజృంభించారు ఎన్టీఆర్. పాజిటివ్ షేడ్స్ ఉన్న లవ, కుశలో హీరోయిజం చూపించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న రోల్లో కనిపించనున్నారని టాక్. అది కూడా హిందీ తెరపై. బాలీవుడ్ యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (చదవండి: నాన్న చనిపోయాక అప్పు తీర్చలేక ఆస్తులమ్మేశాం: శివ బాలాజీ ) హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, అలాగే ఆయన పాత్ర నెగటివ్‌గా ఎందుకు మారుతుంది? అనేదానికి ఓ బలమైన కారణం ఉండేలా అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో కథానాయికల పాత్రల కోసం దీపికా పదుకోన్, శర్వరీ వాఘ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. (చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్, అప్పటి క్షణాలను తలుచుకుంటూ.. ) అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఇదిరా ఎన్టీఆర్ సత్తా అంటే...
-
వార్ కి టైమ్ అవుతుంది..
-
ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ భారీ సినిమా
-
ఇది అన్యాయం.. అప్పుడు చరణ్ తో, ఇప్పుడు హృతిక్ తో
-
ప్రభాస్ నో చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్!.. ఏకంగా వంద కోట్లు
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా విజయంతో మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక హీరోగానే కాకుండా యంగ్ టైగర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఇదివరకే జై లవకుశ సినిమాలో చూపించాడు. ఆ సినిమాలో నెగిటివ్ రోల్లో దుమ్ముదులిపాడు తారక్. ఇప్పుడు మరో స్టార్ హీరోతో తలపడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ -2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే వార్-2కి విలన్‌గా ఎన్టీఆర్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయట. అందులో మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దగ్గరకి ఆఫర్ వెళ్లిందట. అయితే ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ సున్నితంగా నో చెప్పాడట. అంతేకాకుండా మల్టీస్టారర్ కూడా అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ఇక ఎన్టీఆర్‌కు ముందు విజయ్ దేవరకొండను ఈ ప్రాజెక్టులో తీసుకోవాలని మొదట భావించారట. కానీ లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత అంచనాల తలకిందులయ్యాయి. దీంతో విజయ్ స్థానంలో ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే..ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రూ. 45కోట్ల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ వార్-2 కోసం రూ. 100కోట్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. -
వార్ 2 కోసం కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్
-
వార్-2లో జూనియర్ ఎన్టీఆర్.. ఎంట్రీతోనే రికార్డ్ రెమ్యునరేషన్!
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంతో యంగ్ టైగర్ గ్లోబర్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. దీంతో ఎన్టీఆర్ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. బాలీవుడ్లో హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ -2లో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అటూ బి-టౌన్‌లోనూ.. ఇటూ టాలీవుడ్‌లోనూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వార్- 2కు తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.40 నుంచి రూ.50 వరకు కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్ వార్- 2 కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు రూ.100 కోట్ల క్లబ్లో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోలు ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగానే ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం వార్- 2 మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. -
వార్ 2 వెనుక టాప్ సీక్రెట్
-
Jr NTR - Hrithik Roshan: హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ యుద్ధం.. ఇది కదా అసలైన మల్టీస్టారర్!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్‌గా మారారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలిద్దరు తమ తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. రామ్ చరణ్ ఆర్సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉంటే.. తారక్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ‘NTR30’ ప్రారంభించారు. రీసెంట్గా సెట్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇలా వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న తారక్.. ఇప్పుడు పెద్ద యుద్దమే ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్’ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘వార్’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఈ సినిమా సీక్వెల్‌ని రూపొందిస్తామని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా వార్ 2కి స్టేజి ఇప్పుడు సెట్ అయ్యింది. అయితే ‘వార్’ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే... ‘వార్ 2’కు మాత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది. వార్ 2’ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు నిన్న వార్తలు వినిపంచాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ కాంబో ఖరారై చాలా రోజులే అయినట్టుంది. ‘బ్రహ్మాస్త్ర’ విడుదల సమయంలో ఆ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అప్పటికే వార్ 2లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. IT’S OFFICIAL… HRITHIK - JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7 — taran adarsh (@taran_adarsh) April 5, 2023