వార్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Countdown begins for War 2 release | Sakshi
Sakshi News home page

వార్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Jun 27 2025 6:05 AM | Updated on Jun 27 2025 6:05 AM

Countdown begins for War 2 release

థియేటర్స్‌లో ‘వార్‌ 2’కి యాభై రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్‌ రోల్స్‌లో నటించిన స్పై యాక్షన్‌ సినిమా ‘వార్‌ 2’. ‘వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌)’ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘వార్‌ 2’ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

కాగా ఈ సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్, కియారా అద్వానీల పోస్టర్స్‌ను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. అలాగే ‘వార్‌ 2’ సినిమాను ఉత్తర అమెరికా, మిడిల్‌ ఈస్ట్, యూకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్‌ ఈస్ట్‌ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్‌ థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా కూడా మేకర్స్‌ తెలిపారు. 

‘‘భారతీయ సినీ పరిశ్రమలో ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించనున్నాం’’ అని తెలిపారు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిబ్యూషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నెల్సన్‌ డిసౌజా. ‘‘యాక్షన్‌’ చిత్రాలకే ‘వార్‌ 2’ సినిమా ఓ పాఠంలా ఉంటుంది. ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఐమ్యాక్స్‌లో మాత్రమే పొందగలరు’’ అని పేర్కొన్నారు ఐమ్యాక్స్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టఫర్‌ టిల్లా్మన్‌.

Advertisement
 
Advertisement
Advertisement