ఏడాది తిరిగేసరికి మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ | Kiara Advani Announce Second Pregnancy | Sakshi
Sakshi News home page

Kiara Advani: గతేడాది కూతురు పుట్టింది.. ఇంతలోనే శుభవార్త

Oct 7 2026 11:09 AM | Updated on Oct 7 2026 12:08 PM

Kiara Advani Announce Second Pregnancy

స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ శుభవార్త చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్న సంగతి బయటపెట్టింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తోటి నటీనటులు కియారాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఎఫెక్ట్.. చిరుతో సినిమాపై నాని కామెంట్స్)

హిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన కియారా అసలు పేరు ఆలియా.. ఇప్పటికే ఆలియా భట్ ఇండస్ట్రీలో ఉండటంతో తన పేరుని కియారాగా మార్చుకుంది. 2014లో 'ఫగ్లీ' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. అనంతరం 'ధోని' బయోపిక్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 'భరత్ అనే నేను'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ మూవీస్ ఇక్కడ చేసింది.

హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్', సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి చేసిన 'షేర్షా' చిత్రాలతో ఈమెకు సక్సెస్ తెచ్చిపెట్టాయి. అయితే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించిన కియారా.. పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు గతేడాది జూలై 15న కూతురు పుట్టింది. ఆ పాపకు సరాయా అని పేరు పెట్టారు. ఇది జరిగి ఏడాది అయిందో లేదో ఇంతలోనే మరోసారి ప్రెగ్నెంట్ ‍అయినట్లు బయటపెట్టిన కియారా.. శుభవార్త చెప్పేసింది.

(ఇదీ చదవండి: అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు తెగ నవ్వించాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement