‘‘మాతృభూమి’ సినిమా అద్భుతమైన కథతో రూపొందింది. భారత సైనికుల మానవీయ కోణాన్ని చూపించే కథ ఇది’’ అని సల్మాన్ ఖాన్ చెప్పారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ డిసెంబరు 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కి విచ్చేశారు సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘మాతృభూమి’ మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచి మా చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మా మూవీ ట్రైలర్ కేవలం 9 రోజుల్లోనే 9 కోట్ల వ్యూస్ దాటి ఇంటర్నెట్‌ను కుదిపేసింది.
షూటింగ్ సమయంలో సవాళ్లు ఎదుర్కొన్నాం. అయితే ఇప్పటివరకు మా సినిమా కంటెంట్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో మా కష్టం మరచిపోయాం’’ అని తెలిపారు. చిత్రాంగద సింగ్ మాట్లాడుతూ–‘‘మాతృభూమి’ టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. మా చిత్రాన్ని థియేటర్లలో చూడండి... తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.


