రష్మిక కోసం 'ఒసేయ్ రాములమ్మ' రీమిక్స్ | Rashmika Mysaa Osey Ramulamma Song Full Video | Sakshi
Sakshi News home page

Rashmika Osey Ramulamma Song: మళ్లీ 'రాములమ్మ'.. రష్మిక రక్తపాతం

Nov 20 2026 9:01 PM | Updated on Nov 20 2026 9:01 PM

Rashmika Mysaa Osey Ramulamma Song Full Video

గత నెలలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి'లో రష్మిక వచ్చింది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన 'మైసా' విడుదలకు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ చిత్రం కోసం ఫేమస్ సాంగ్ 'ఒసేయ్ రాములమ్మ'ని రీమిక్స్ చేశారు. తాజాగా ఆ గీతాన్ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న 'జబర్దస్త్' కమెడియన్)

విజయశాంతి 'రాములమ్మ' పాట ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రష్మిక నటించిన గ్రామీణ నేపథ్య సినిమా కోసం ఆ పాటలో కొన్ని లిరిక్స్ మార్చి రీక్రియేట్ చేశారు. వినగానే మరీ అంత గొప్పగా అనిపించలేదు గానీ బాగానే ఉందనిపించింది. అయితే ఈ మూవీలో రష్మిక.. యాక్షన్ హీరోల్లా రక్తపాతం చేసినట్లే కనిపిస్తోంది. పాటలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రవీంద్ర పుల్లె దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు.

(ఇదీ చదవండి: సమంతకు బిడ్డ.. 12 ఏళ్ల క్రితం జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement