మహిళలపై జరుగుతున్న నేరాలు అనే అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని, మహిళా భద్రత, సమర్థవంతమైన పోలీసు దర్యాప్తు నేపథ్యంలో తీస్తున్న సినిమా 'అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్'. నిజ జీవిత ఘటనల ఆధారంగా బహుభాషా క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా దీన్ని తీస్తున్నారు. యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పిస్తుండగా, ప్యారేలాల్ గుండెచా (సోజాత్ రోడ్ వాలా) నిర్మిస్తున్నారు.
(ఇదీ చదవండి: సమంతకు బిడ్డ.. 12 ఏళ్ల క్రితం జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది)
టాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో పృథ్వీ రాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. 'మర్డర్ 2', 'భాగ్ జానీ', 'ధర్మ సంకట్ మే' వంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ప్రశాంత్ నారాయణన్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సిక్కు పోలీస్ అధికారిగా సంజయ్ కపూర్ కనిపించారు. ఇంట్లో పెట్టిన ఒక ప్రేమలేఖ కారణంగా జరిగిన అపార్థంతో ఒక టీనేజ్ అమ్మాయి అదృశ్యం కావడమే ఈ సినిమా కథాంశం. ఇది వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న 'జబర్దస్త్' కమెడియన్)


