సమంత కొడుకు పేరుకు అర్థం ఇదే..! | Samantha Son Dev Name Meaning | Sakshi
Sakshi News home page

Samantha Son Dev: సమంత కొడుకు పేరుకు అర్థం ఇదే..!

Nov 20 2026 5:49 PM | Updated on Nov 20 2026 5:49 PM

Samantha Son Dev Name Meaning

 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన బిడ్డకు ‘దేవ్‌ నిడిమోరు’ అని పేరు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  సమంత ప్రకటించారు. అయితే ఈ పేరు అర్థం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అయితే దాని అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం!

(ఇదీ చదవండి: ఈ రోజే హీరోయిన్‌గా డెబ్యూ.. అల్లు అరవింద్‌ గోల్డెన్‌ ఆఫర్‌)

దేవ్ అంటే..
దేవ్ అంటే ‘దైవం’, ‘దివ్యమైనవాడు’ అని అర్థం. దీంతో పాటు ప్రకాశించేవాడు, కాంతివంతుడు, అనే అర్థాలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో రాజు, మేఘం అనే అర్థాల్లోనూ వాడుతారు.  

కాగా గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలైన తర్వాత సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అనంతరం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు.

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement