అర్ధరాత్రి ఏడుస్తూ కాల్‌ చేస్తున్నారు: అల్లు అరవింద్‌ | Allu Aravind Emotional Speech At Aakasamlo Oka Tara Movie Success Meet, Praises Dulquer Salmaan Film Response | Sakshi
Sakshi News home page

Allu Aravind Speech: అర్ధరాత్రి ఏడుస్తూ కాల్‌ చేస్తున్నారు: అల్లు అరవింద్‌

Nov 20 2026 4:42 PM | Updated on Nov 20 2026 5:08 PM

Allu Aravind Speech AOT Movie Success meet

దుల్కర్ సల్మాన్ హీరోగా.. డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌ కాగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా నేడు (నవంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి స్పందన అందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్‌.. చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘ సినిమా తీసినప్పుడు మంచి సినిమా తీస్తున్నాంలే..   నిజాయతీగా తీస్తే ప్రజలు ఆదరిస్తారనే అనే నమ్మకంతోనే ఉన్నాం. అయితే మేము అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. 

సినిమా  చూసినవారు సుమారు రాత్రి 1.00 వరకు ఫోన్‌  చేసి సినిమా బాగుందని చెబుతున్నారు. కొంతమంది ఏడుస్తూ కాల్‌ చేస్తున్నారు. అది నాకు ఓ మంచి కొత్త అనుభవం ఇస్తోంది. ఒక మంచి సినిమా తీస్తే ఇంత ఆదరిస్తారా అని నాకే ఆశ్చర్యం వేస్తోంది. త్వరలోనే మరో సక్సెస్‌ మీట్‌ను నిర్వహిస్తాం‘ అని అల్లు అరవింద్‌  తెలిపారు. 
(ఇదీ చదవండి: సినిమాల్లో నటిస్తే.. బయట అలా తాకాలా..?: కీర్తి సురేశ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement