నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిందీలో కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ విజయాన్ని అందుకున్నప్పటికీ తనకు తగిన గుర్తింపు రాలేదని దర్శకుడు విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమాపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అభినందించిన వారు కొంతమందే
‘పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. కానీ నా సినిమా విషయంలో మాత్రం ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా స్పందించలేదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది ఈ సినిమా కోసం ప్రశంసిస్తున్నప్పటికీ.. బహిరంగంగా అభినందించిన వారు కొంతమందే. అందులో వరుణ్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి వారు ఉన్నారు. నా సినిమా విజయంపై ఏ ప్రముఖ స్టూడియో లేదా నిర్మాణ సంస్థ లేఖ రాయలేదు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు’ అని ఆయన వెల్లడించారు.
(ఇదీ చదవండి: సమంత కొడుకు పేరుకు అర్థం ఇదే..!)


