breaking news
Hanuman Ansh Movie
-
అక్కడ బ్లాక్‌బస్టర్.. తెలుగులో డిజాస్టర్..!
చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా హనుమాన్ అంశ్. బాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. కేవలం మౌత్‌టాక్‌తోనే హిందీలో కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్వంలో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. తొలి మూడు రోజుల్లో కేవలం రూ.2 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిందీలో వసూళ్లపరంగా దూసుకెళ్లిన ఈ మూవీ.. తెలుగులో వచ్చేసరికి అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది.రిలీజ్ ఆలస్యం వల్లేనా?హిందీలో రిలీజైన రెండు నెలల తర్వాత రిలీజ్ చేయడం.. వసూళ్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మొదట త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ కుదరలేదు. ఆ తర్వాత హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్వంలో విడుదల చేశారు. రిలీజ్ ఆలస్యం కావడం.. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు దూరమైనట్లు తెలుస్తోంది. కాగా.. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. -
‘హనుమాన్ అంశ్’ మూవీ రివ్యూ
ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరమవుతోంది. చిన్న సినిమాలకు సైతం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఓ హిందీ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అదే ‘హనుమాన్ అంశ్’. భారీ హంగులు, స్టార్ హీరోలు లేకుండానే సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్ 9) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఇంతటి విజయాన్ని అందుకునేలా ఇందులో ఏముంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగిన కథ ఇది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ(శోభినవ్ సత్య) అనే బాలుడి జీవితంతో కథ ప్రారంభం అవుతుంది. చనిపోయిన తల్లి..దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పడంతో.. ఆ బాలుడు మనసు భగవంతుడివైపు మళ్లుతుంది. క్రమంగా ఆంజనేయస్వామి భక్తుడిగా మారుతాడు. కుటుంబాన్ని, ఇంటిని వదిలేసి..రామ జపం చేస్తూ ఉత్తర భారతదేశం మొత్తం తిరుగుతుంటాడు. చివరికి అదే ఆధ్యాత్మిక ప్రయాణం అతడిని నీమ్ కరోలి బాబాగా మారే దిశగా తీసుకెళ్తుంది. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది? ఆయన సాగించిన ప్రయాణంలో ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాడు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే టైటిల్ చూస్తే..ఇది పౌరాణిక కథ అనుకుంటారు. కానీ ఇది ఓ సాధారణ మనిషి తన జీవితంలో ఎదురైన బాధలు, మనసులో మెదిలిన ప్రశ్నలు అతడిని భక్తి మార్గం వైపు ఎలా నడిపించాయన్నదే ఈ చిత్రంలోని ప్రధానాంశం. భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలకే పరిమితమా? దేవుడిని ప్రేమించడం అంటే ఆరాధించడం మాత్రమేనా? లేక మన చుట్టూ ఉన్న మనుషులకు అండగా నిలబడి, వారికి సేవ చేయడంలోనూ దైవత్వాన్ని చూడాలా? అనే ప్రశ్నలను సినిమా తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంది. అందుకే ఇది కేవలం ఆధ్యాత్మిక చిత్రంగా కాకుండా, మానవీయ విలువలను గుర్తుచేసే కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఫస్టాఫ్ మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ సాగుతుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం.. తండ్రి మరోకరి పెళ్లి చేసుకోవడంతో ఆ బాలుడి మనసు మారుతుంది. కన్నతల్లిని తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో దేవుడి కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు దైవభక్తి ఉన్నవారికి బాగా కనెక్ట్ అవుతాయి. వెనుకబడిన వర్గాల పిల్లలకు తన భోజనాన్ని పంచే సీన్ హృదయాలను హత్తుకుంటాయి. ఇలా ఫస్టాఫ్ మొత్తం దైవభావన కలిగించేలా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎక్కువగా బాబా మహిమలనే చూపించారు. రైలు నుంచి అతన్ని దింపేస్తే..రైలు ఆగిపోవడం.. జైలులో బందిస్తే..బయటకు రావడం.. రాళ్లను స్వీట్లుగా మార్చడం..ఇలాంటి కొన్ని వింతలు ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటే..మరికొందరికి కాస్త అతిగా అనిపిస్తాయి. ఎమోషన్స్ కంటే ఎక్కువగా బాబా చూపిన మహిమల మీదనే ఎక్కువ దృష్టిపెట్టారు. నీమ్ కరోలీ బాబా గురించి నార్త్ వాళ్లకు బాగా తెలుసు కాబట్టి..వాళ్లు ఈ కథను ఓన్ చేసుకున్నారు. దక్షిణాది వారికి అంతగా పరిచయం లేదు..అందుకే ఈ కథతో పూర్తిగా కనెక్ట్ కాలేరు. అయితే దైవ భక్తి ఉన్నవారికి మాత్రం ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవాళ్లే. అందరూ బాగానే చేశారు. అయితే కథ మొత్తం నీమ్ కరోలీ బాబా పాత్ర చుట్టూనే తిరగడంతో ఆయన తప్ప మరోకరు గుర్తుకురారు. ఆ పాత్రలో శోభినవ్ సత్య జీవించేశాడు. తెరపై అచ్చం బాబాలాగే కనిపించాడు. డాక్టర్ రామ్ నందన్ పాత్రకి చందన్ కె ఆనంద్ న్యాయం చేశాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాధు సుశీల్ తివారీ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.విశాల్ బావా సినిమాటోగ్రఫీ, శంఖ్ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. డైలాగ్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు బడ్జెట్ చాలా తక్కువ. సినిమా చూస్తే అది అర్థమైపోతుంది. విజువల్స్ అంత రిచ్‌గా ఉండవు. -
హనుమాన్ అంశ్ని పిల్లలతో కలిసి చూడండి
‘‘హనుమంతుడు ఉన్న ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. రెండు కోట్లు పెట్టి తీసిన ‘హనుమాన్ అంశ్’ రూ. 400 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఈ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్‌కి థ్యాంక్స్. పిల్లలందరితో కలిసి తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది. తెలుగులోనూ చాలా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వై. రవిశంకర్ అన్నారు. శోభినవ్ సత్య లీడ్ రోల్లో విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. విశాల్ చతుర్వేది, నమ్రత జి. సింగ్, అనుప్రియ నాగర్, రాగిణి సోనా నిర్మించిన ఈ హిందీ చిత్రం ఆగస్టు 7న బాలీవుడ్లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ రిలీజ్ హక్కులను హోంబలే ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 9న తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో శోభినవ్ సత్య మాట్లాడుతూ– ‘‘హనుమాన్ అంశ్’ భారతీయల సినిమా. తెలుగు ప్రేక్షకులందరూ చూసి, ఈ సినిమా గురించి అందరితో చె΄్పాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. విశాల్ చతుర్వేది మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఉత్తరాదిలో ఈ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో, తెలుగులోనూ అంతే గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ప్రొడ్యూసర్ రాగిణి పేర్కొన్నారు. -
హనుమాన్ అంశ్ మూవీ ప్రెస్ మీట్... (ఫోటోలు)
-
'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఏకంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెడుతున్న సినిమా 'హనుమాన్ అంశ్'. లెక్క ప్రకారం దీని తెలుగు వెర్షన్‌ని గత నెలలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ ఈ మేరకు ముందుకొచ్చారు. కానీ ఏమైందో ఏమో వెనక్కి తగ్గారు. దీంతో సలార్, కేజీఎఫ్ చిత్రాల్ని నిర్మించిన హోంబలే సంస్థ.. తెలుగు హక్కుల్ని దక్కించుకుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?)ఈ శుక్రవారం(అక్టోబర్ 09) తెలుగులోనూ రిలీజ్ అవుతున్న 'హనుమాన్ అంశ్' ట్రైలర్‌ని ఇప్పుడు రిలీజ్ చేశారు. చూడటానికి ప్లెజెంట్‌గా బాగుంది. కాకపోతే తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి? నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా) -
కైన్చీ ధామ్ వెళ్లే ముందు.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుని కీలక సూచన
కైన్చీ ధామ్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కైన్చీ ధామ్‌కు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ‘హనుమాన్ అంశ్’ సినిమా దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. కైన్చీ ధామ్‌లో ప్రస్తుతం పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే అక్కడికి వెళ్లాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉంటే సమీపంలోని ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని కోరారు.నీమ్ కరోలి బాబా నడయాడిన కైన్చీ ధామ్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి. 1964లో నీమ్ కరోలి బాబా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయనను భక్తులు హనుమంతుడి అవతారంగా భావిస్తారు. ‘హనుమాన్ అంశ్’ సినిమా విడుదలైన తర్వాత ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. కైన్చీ ధామ్‌లో ప్రస్తుతం భారీ రద్దీ ఉందని తెలిపారు.సినిమా చూసిన తర్వాతే ప్రజలు అక్కడికి వస్తున్నారనే ప్రచారం ఉందని పేర్కొంటూ.. అది నిజమైనా, కాకపోయినా క్షేత్రంలోని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే వెళ్లాలని సూచించారు. కైన్చీ ధామ్‌లో రద్దీ ఎక్కువగా ఉండి, గంటల తరబడి క్యూలు ఉంటే ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని దర్శకుడు సూచించారు. నీమ్ కరోలి గ్రామం, బృందావనం వంటి ప్రాంతాలను కూడా భక్తులు సందర్శించవచ్చని సూచించారు. భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ముందస్తు సమాచారం తెలుసుకోవాలన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యం: ఆరేళ్ల తర్వాత మళ్లీ అధ్వాన్నం! -
‘హనుమాన్ అంశ్’ ప్రభావం.. కైంచీ ధామ్‌లో అనూహ్య రద్దీ!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా విపరీతమైన జనాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు ఉత్తరాఖండ్‌లోని కైంచీ ధామ్ సందర్శనకు తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో జనాలు కిక్కిరిసి ఉంటడం, ఒకరినొకరు దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కైంచీ ధామ్ భక్తులతో కిటకిటలాడుతోంది. బాబా నీమ్ కరోలీ మహరాజ్ మహిమలు, ఆంజనేయ స్వామి తత్వాన్ని చాటిచెప్పిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రభావంతో దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తింది. ప్రస్తుతం వరుస సెలవులు కలిసిరావడంతో బాబా దర్శనం కోసం భక్తులు, పర్యాటకులు వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం ఎదుట బారులు తీరారు.‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రభావంతో ఈ ప్రాంతానికి వచ్చే భక్తుల తాకిడి సాధారణం కంటే రెట్టింపు అయ్యింది. దీంతో నైనీతాల్ కొండ రహదారులు పూర్తిగా వాహనాలతో స్తంభించిపోయాయి. భవాలీ నుంచి కైంచీ ధామ్, గరమ్‌పానీ మీదుగా ఖైర్నా వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ప్రయాణికులు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లోనే నిరీక్షించాల్సి వస్తున్నది.అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు శని, ఆదివారాలు కలిసి రావడంతో యువత, కుటుంబాలు సైతం ఉత్తరాఖండ్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక్క నైనీతాల్, కైంచీ ధామ్ పరిసరాలకే దాదాపు 12 వేల మందికి పైగా చేరుకున్నారు. కైంచీ ధామ్తో పాటు భీమ్తాల్, ముక్తేశ్వర్, రిషికేశ్, చార్ధామ్ మార్గాల్లోనూ పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో పోలీసులు, స్థానిక అధికారులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు చేస్తున్నారు. రూట్ డైవర్షన్లు, ప్రత్యేక షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ వ్యక్తిగత వాహనాలతో రోడ్లపై రద్దీ ఏర్పడుతోంది. భక్తులు తమ సొంత వాహనాలతో నేరుగా ఆలయం సమీపానికి రాకుండా, నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలు ఉంచి, షటిల్ సర్వీసులను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.ఇదీ చదవండి: హసీనా రాక వెనుక.. భారత్ కీలక వివరణ -
హనుమాన్ అంశ్ ఫిక్స్
బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హనుమాన్ అంశ్’ మూవీ తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభినవ్ సత్య, చందన్ కె. ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో విశాల్ చతుర్వేది, నమ్రత జి. సింగ్, అనుప్రియ నాగర్, రాగిణి సోనా నిర్మించిన ఈ హిందీ చిత్రం ఆగస్టు 7న బాలీవుడ్లో విడుదలైంది. 1900–1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా (మహారాజ్ జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమా రూ పొందింది. రూ. 2 కోట్లతో రూ పొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబరు 18న తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తెలుగు విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 9న తెలుగు వెర్షన్‌ని విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ‘‘ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపై దైవిక వైభవాన్ని వీక్షించేలా ఎంతో ఆదరణ పొందిన ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెలుగులో తీసుకురావడం హ్యాపీగా ఉంది’’ అని ఆ సంస్థ పేర్కొంది. -
రూ.400 కోట్ల సినిమా.. ఎట్టకేలకు తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
చిన్న సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ హనుమాన్ అంశ్. బాలీవుడ్లో మాత్రమే తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ.2 కోట్లతో ఈ మూవీని నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.హిందీలో హిట్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారని టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత రిలీజ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. దీంతో తెలుగు రిలీజ్ వాయిదా పడింది.తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేసింది. అదే రోజు వెంకటేశ్ నటించిన ఆదర్శ కుటుంబం కూడా విడుదల కానుంది. కాగా.. 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితమే ఈ హనుమాన్ అంశ్. ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం..!We are delighted to bring the much loved #HanumanAnsh in TELUGU, for audiences to witness its divine brilliance on the big screen across the world. ❤️🙏#HanumanAnshTelugu Worldwide Release on OCTOBER 9th by @hombalefilms.… pic.twitter.com/kusXOCK3IV— Hombale Films (@hombalefilms) October 2, 2026 -
రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్లు వచ్చాయి..!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ మరో మైలురాయి చేరుకుంది. ఈ చిత్రం రిలీజైన 52 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాని నటించిన 'ది ప్యారడైజ్', సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటించిన 'ది వాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' వంటి పెద్ద చిత్రాలు విడుదలైనా వసూళ్లను నమోదు చేసింది.ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్క్ ప్రకారం ఇప్పటివరకు భారతదేశ రూ. 307.03 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 362.70 కోట్లకు పైగా సాధించింది. ఓవర్సీస్లో రూ. 38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్త రూ. 401.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే 50 రోజులు దాటినా కూడా హనుమాన్ అన్ష్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. కాగా.. ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో చందన్ కె ఆనంద్, నిఖిల్ దుబే, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. -
ఫీజు వద్దన్న డైరెక్టర్‌కు రూ.కోట్లలో జాక్‌పాట్
చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించి భారీ వసూళ్లు రాబెట్టిన చిత్రాల్లో.. ‘హనుమన్ అంశ్’ కూడా ఒకటి. కేవలం రూ.1.5 కోట్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 360 కోట్లకు పైగా వసూళ్లు రాబెట్టింది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా వెండి తెరను ముద్దాడుతోంది. ఈ ఏడాది భారీ వసూళ్లను రాబెట్టిన ‘ధురంధర్2, ‘బోర్డర్2’ తర్వాత చిత్రంగా ఇది నిలిచినట్లు లెక్కలు చెబుతున్నాయి.నిర్మాత అనుప్రియా నగర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా బడ్జెట్ రూ.1.5 కోట్లకు కొద్దిగా ఎక్కువేనని వెల్లడించారు. ఇందులో తాను స్వయంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విశాల్ చతుర్వేది మాత్రం సినిమా నిర్మాణ సమయంలో ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్లు తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదీ చదవండి: రష్మికతో విజయ్ ఈ మేకింగ్ వీడియో చూశారా?లాభాల్లో వాటా!‘హనుమాన్ అంశ్’ కోసం విశాల్ చతుర్వేది దాదాపు 14 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని అనుప్రియా తెలిపారు. ‘కథను గతంలో పలువురు ఓటీటీ సంస్థలకు కూడా చెప్పినప్పటికీ సినిమా పట్టాలెక్కలేదు. చివరికి సహ నిర్మాతలు రాగిణి సోనా, నమ్రతా సింగ్ ఈ కథపై నమ్మకం ఉంచడంతో ప్రాజెక్ట్ మొదలైంది. బడ్జెట్ చాలా తక్కువగా ఉండటంతో విశాల్ తన దర్శకత్వానికి ఎలాంటి ఫీజు తీసుకోలేదు’ అనుప్రియా వెల్లడించారు. థియేట్రికల్ రన్ అంచనాలకు మించి వెళ్లడంతో నిర్మాతగా దాదాపు రూ.50 కోట్ల వరకు రావొచ్చని అనుప్రియా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల డీల్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కాగా ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం.. ‘హనుమాన్ అంశ్’ 47 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే..సినిమా నుంచి ఇంత డబ్బు వస్తుందని ఊహించలేదని అనుప్రియా తెలిపారు. ఈ ఆదాయాన్ని సమాజానికి తిరిగి ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి మరిన్ని కథలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’.. -
పెద్ది, టాక్సిక్, జన నాయగన్.. మూడు సినిమాల రికార్డ్ బ్రేక్..!
ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న చిన్న సినిమా హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్ల మార్క్ దాటేసింది. నాలుగొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఓవర్సీస్లోనూ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా హిట్ కావడంతో అదరగొడుతోంది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ లాంగ్రన్ వసూళ్లను దాటేసింది. యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రూ.339 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. హనుమాన్ అంశ్ ఇప్పటికే ఆ రికార్డ్ అధిగమించింది. రూ.360 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. ఎటువంటి అంచనాలు లేకుండానే వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం 2026 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 భారతీయ చిత్రాల జాబితాలో చేరింది.ఇప్పటికే హనుమాన్ అన్శ్ చిత్రం విజయ్ నటించిన 'జన నాయగన్' (రూ.324 కోట్లు), యశ్ 'టాక్సిక్' (రూ.341 కోట్లు), రామ్ చరణ్ 'పెద్ది' (రూ.342 కోట్లు) పాన్-ఇండియా చిత్రాల లైఫ్‌టైమ్ బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించింది. ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసిన బాలీవుడ్ మూవీ 'బోర్డర్-2'... హనుమాన్ అంశ్ కంటే ముందుంది. -
కేవలం రూ.2 కోట్ల సినిమా.. రెండో సినిమాగా రికార్డ్..!
కంటెంట్ ఉంటే చాలు ఎంత చిన్న సినిమా అయినా సరే కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం రూ.2 కోట్లతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులతో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.360 కోట్లకి పైగా వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కించిన హనుమాన్ అంశ్ ఇప్పటికే పలు రికార్డులు సాధించింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. ఓవర్సీస్లో విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఈ రికార్డ్ సాధించింది. ఆగస్టు 7న భారతదేశంలో విడుదలైన హనుమాన్ అంశ్.. విదేశాల్లో సెప్టెంబర్ 11న రిలీజ్ చేశారు. హోంబలే ఓవర్సీస్, ఫార్స్ ఫిల్మ్‌తో కలిసి విదేశాల్లో విడుదల చేశారు.ఇండియాలో ఇప్పటి వరకు రూ.280.93 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. 47 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలో ఆరు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఈ ఏడాది ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 బాలీవుడ్ చిత్రాల జాబితాలో చేరింది.HANUMAN ANSH GOES GLOBAL! 🌎🔥#HanumanAnsh has crossed the $3.5 MILLION+ mark overseas in just 12 days, emerging as the 2nd Highest Overseas Grosser of 2026, as per the makers.Read Here On #CellebIndia👇https://t.co/DE4BAvxklq pic.twitter.com/UBWdxlJX9h— Celleb India (@CellebIndia) September 23, 2026 -
ది ప్యారడైజికి పోటీగా నా సినిమా రిలీజ్ చేస్తా.. హనుమాన్ అంశ్ నా స్ఫూర్తి..
-
రూ.350 కోట్ల సినిమా.. తెలుగులో రిలీజ్ ఉందా?
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బాలీవుడ్ మూవీ హనుమాన్ అంశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు విడుదలై ఎనిమిది వారాలైన ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నెల 18న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ హక్కులను టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆయన తప్పుకున్నారని టాక్ వినిపించింది. దీంతో టీజర్ రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే ఈ మూవీ తెలుగు రిలీజ్‌పై ఎలాంటి టాక్ వినిపించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంతో సస్పెన్స్ నెలకొంది. ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఇక తెలుగులో రిలీజ్ లేనట్టే కనిపిస్తోంది. అదే జరిగితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని కేవలం ఓటీటీలో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు. -
ఏడు వారాలైనా అదే జోరు.. హనుమాన్ అంశ్కి ఎన్ని కోట్లంటే?
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మూవీ 'హనుమాన్ అన్ష్'. ఈ సినిమా మౌత్ టాక్‌తోనే కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజై ఏడు వారాలైనప్పటికీ వసూళ్లపరంగా ఇంకా రాణిస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.316 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో రూ. 293 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ.. రూ.248 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ 43వ రోజున సైతం 18 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. సెప్టెంబర్ 18న రూ. 6.25 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవందాస్ పటేల్, నేహా పరంజపే, విహాన్ షెడ్గే ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతంత్ర్యానికి పూర్వం తల్లి మరణానంతరం ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరిన లక్ష్మీ నారాయణ్ అనే యువకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. దేవుడి అన్వేషణలో ఉత్తర భారతదేశమంతటా పర్యటించిన అతడు.. చివరికి నీమ్ కరోలి బాబాగా మారుతాడు. -
ముగ్గురు మహిళలు.. రూ.291 కోట్ల సంచలనం..! 40 రోజుల్లోనే..
నీమ్ కరోలి బాబా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రూ.291.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 40 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోబినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో విశ్వాసం, ప్రేమ, సేవ, భక్తి వంటి అంశాలను చూపించారు.ముగ్గురు మహిళల పెట్టుబడి..‘హనుమాన్ అంశ్’ నిర్మాణంలో ముగ్గురు మహిళలు కీలకంగా వ్యవహరించారని మీకు తెలుసా. రాగిణి సోనా, నమ్రత జీ. సింగ్‌తో పాటు 21 ఏళ్ల అనుప్రియా నగర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఒక్కొక్కరు సుమారు రూ.60 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టామని అందులో ఒకరైన అనుప్రియా వివరించారు. అయితే తాను సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రాజెక్టులో లేనని అనుప్రియా స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో తాను చిత్ర బృందంలోకి వచ్చినట్లు తెలిపింది. ‘నేను ముగ్గురు మహిళా నిర్మాతల్లో చిన్నదాన్ని. షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలోకి వచ్చాను. పోస్ట్ ప్రొడక్షన్ కోసం డబ్బులు అవసరమైన సమయంలో నా వంతు పెట్టుబడి పెట్టాను’ అని అనుప్రియా తెలిపింది.దర్శకుడు ఏమన్నారంటే?అనుప్రియా పాత్రపై దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా స్పందించారు. ఆమె తమ బృందంలో నిర్మాతేనని, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. అయితే అనుప్రియా కథ రాశారని, సినిమాను ఆమె క్యూరేట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఆమె స్వయంగా ఆ విషయాన్ని ఖండించారని తెలిపారు. ఇక అసలు నిర్మాతలైన రాగిణి సోనా, నమ్రతా సింగ్ కూడా సినిమాకు ఎంతో కష్టపడ్డారని విశాల్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?)ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆఫర్లుథియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకోవడంతో ‘హనుమాన్ అంష్’పై ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకటి, రెండు కాకుండా మూడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ సినిమా హక్కుల కోసం సంప్రదిస్తున్నట్లు నిర్మాత రాగిణి సోనా వెల్లడించారు. అయితే ఈ సినిమాను మొదటి నుంచే ఓటీటీ కోసం తెరకెక్కించలేదని ఆమె స్పష్టం చేశారు. పెద్ద తెరపైనే ప్రేక్షకులు సినిమాను చూడాలనేది తమ ఉద్దేశమని తెలిపారు.22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..దర్శకుడు విశాల్ చతుర్వేది ప్రకారం.. తొలుత 26 రోజుల షూటింగ్‌కు బడ్జెట్ సిద్ధం చేసుకున్నారట. అయితే ఖర్చు పెరిగే అవకాశం ఉండటంతో 22 రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేశారట. పరిమిత వనరులతో సినిమాను పూర్తి చేయడం తమకు పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. కాగా అనుమన్ అంశ్ తెలుగులో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. -
హనుమాన్ అంశ్ తెలుగు వర్షన్ వాయిదా.. అసలు కారణమిదే
బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియుల్లో ఈ మూవీ రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు రిలీజ్ ఈ నెల 18న కావడం లేదని ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. అందుకు గల కారణాన్ని సైతం వెల్లడించింది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాలేదని తెలిపింది. అందువల్లే హనుమాన్ అంశ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.కాగా.. త్రివిక్రమ్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ డీల్ నుంచి తప్పుకోవడం వల్లే విడుదల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా డబ్బింగ్ పనుల వల్లే రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. దీంతో తెలుగు రిలీజ్‌పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. HANUMAN ANSH TELUGU Version Postponed Due To A Delay In Dubbing Works. A New Release Date Will Be Announced Soon.#HanumanAnsh North America By @PrathyangiraUS@Swambhumedia @filmervishal #ShobhinawSatyaa #VihaanShedge @chandananand #PurnimaTiwari @AKRastogi #GulshanPandey… pic.twitter.com/jESSRArxtP— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 16, 2026 -
రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?
బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియులు సందిగ్ధంలో పడిపోయారు.ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందా? లేదా అనే డైలామాలో పడేశారు. తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడటంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొన్ని కారణాలతో త్రివిక్రమ్ ఈ సినిమా నుంచి వైదొలిగారని.. దీంతో సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విడుదల తేదీ మార్పుపై కూడా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ 18న తెలుగు రిలీజ్ వాయిదా పడనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
నాకింకా 21 ఏళ్ల మాత్రమే.. ఆ డబ్బంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు: ‘హనుమాన్ అంశ్’ నిర్మాత
చిత్ర పరిశ్రమలో కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంటాయి. రూ. కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడతాయి. హనుమాన్ అంశ్ అనే చిత్రం కూడా ఆ కోవలోకి చెందినదే. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చి, రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కేవలం రూ. 10 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. రెండు వారాల తర్వాతే ఈసినిమాకు భారీ కలెక్షన్స్ రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు రూ. 235 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఇంకా ఓవర్సీస్లో విడుదల కాలేదు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఈ నెల 18న విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఇది 'సీఎం విజయ్' వినాయకుడు.. ఫొటోలు వైరల్)ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుందని.. ఈ మేరకు రూ. 100 కోట్లతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై చిత్ర నిర్మాత అనుప్రియ నాగర్ స్పందిస్తూ ఆ వార్తలు అవాస్తవం అని ఖండించారు. ‘సినిమా తెరకెక్కించేటప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నేను కలలో కూడా ఆలోచించలేదు. నీమ్ కరోలి బాబా దివ్య సందేశాన్ని నేటి యువతరానికి అందించాలనేదే నా ఏకైక లక్ష్యం. నాకింకా 21 ఏళ్లే.. ఇంత భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఊహించలేదు, అసలు ఈ డబ్బును ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు’ అని అనుప్రియ నాగర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ చిత్రం నిర్మాణంలో తాను ఒక్కదానినే పాల్గొనలేదని..పూర్తి బడ్జెట్‌తో మూడో వంతు మాత్రమే నేను పెట్టానని..మిగతాది ఇతరులు షేర్ చేసుకున్నారని చెప్పింది.హనుమాన్ అంశ్ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభినవ్ సత్య ప్రధాన పాత్ర పోషించాడు. -
ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడి కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. అలానే మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా 'హనుమాన్ అంశ్' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే హిందీలో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్న చిత్రం తెలుగులో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)హనుమాన్ అంశ్(తెలుగు)తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లో 24 వరకు మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రీసెంట్ సెన్సేషనల్ హిట్ 'ఇరుముడి', మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ బొమ్మలు చూడాలనే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 14 నుంచి 20 వరకు)నెట్ఫ్లిక్స్ద డాల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16మాన్స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17నాట్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ప్లాస్టిక్ బ్యూటీ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 17స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 18ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 (రెంట్)నీగ్లే (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16వెయిటింగ్ హై (హిందీ సిరీస్) - సెప్టెంబరు 16రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18హాట్‌స్టార్78th ఎమ్మీ అవార్డ్స్ (అవార్డ్ షో) - సెప్టెంబరు 15లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18ఆపిల్ టీవీ ప్లస్స్లో హార్సెస్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ) -
బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 18న కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి యావత్ భారతీయ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిదీ ఈ చిత్రం. చిన్న సినిమాగా మొదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీని తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. సెప్టెంబరు 18న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మరి అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కంటెంట్ బలంగా..సాధారణంగా ప్రేక్షకులకు కంటెంట్ బలంగా ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరించడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశం, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. ‘హనుమాన్ అంశ్’ విషయంలోనూ ఇదే ప్లస్ పాయింట్‌గా మారుతుందా లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్ఎంతవరకు ప్రభావం చూపుతుందని..అయితే తెలుగు మార్కెట్ పూర్తిగా భిన్నం. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమయంలో.. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటంతో సినిమాకు అదనపు క్రేజ్ వస్తోంది.కేవలం వసూళ్లను చూసి సినిమాపై అంచనాలు పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. తెలుగు నేటివిటీకి సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది అసలు పరీక్ష. హిందీలో ప్రేక్షకులను మెప్పించిన అంశాలు తెలుగులోనూ వర్కౌట్ అయితే ‘హనుమాన్ అంశ్’ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషనాగుల పాటకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే..ఆదర్శ కుటుంబం..మరోవైపు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్. అక్టోబరు 02న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టీజర్ విడుదల చేశారు. టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. -
తెలుగులోకి 'హనుమాన్ అంశ్ గురూజీ మాస్టర్ ప్లాన్
-
తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ సెప్టెంబరు 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’ కూడా తీస్తున్నట్లు నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. Trivikram Bringing #HanumanAnsh In Telugu pic.twitter.com/5HM8kglTSj— Aakashavaani (@TheAakashavaani) September 11, 2026 -
ఒక సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది
సినిమా అంటేనే ఒక లాటరీ! అందులో జాక్‌పాట్ కొట్టినవాళ్లు రాత్రికి రాత్రే చరిత్ర పుటల్లోకి ఎక్కిపోతారు. నిన్నమొన్నటి వరకు అనుప్రియ నాగర్ అంటే ఎవరో ప్రపంచానికి తెలియదు. కానీ ఇవాళ బాక్సాఫీస్ వద్ద 150 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించిన సంచలన ప్రొడ్యూసర్. కేవలం 2 కోట్లతో తీసిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. అసలు ఎవరీ అనుప్రియ నాగర్? లండన్‌లో చదువుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది? ఇదిగో ఆ క్రేజీ సక్సెస్ స్టోరీ...మామూలు ఘటనలే ఒక్కోసారి మిరకిల్స్గా మారతాయి. లేదా మిరకిల్స్ జరుగుతూ ఉండగా అవి మామూలు ఘటనలనే భ్రమను కలిగిస్తాయి. ‘నీమ్ కరోలి బాబా’ గా ఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక గురువు ‘మహరాజ్జీ’పై తీసిన సినిమాతో ఇన్వాల్వ్ అయిన వారంతా తమకు ఎదురైన ఘటనలను మిరకిల్స్గానే చూస్తున్నారు. ఆ సినిమాను తీయాలని దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి సాధ్యమైంది. నీమ్ కరోలిబాబా పాత్ర కోసం ఒక ముఖ్యమైన నటుణ్ణి అనుకుంటే అతను జబ్బుపడి తప్పుకున్నాడు. సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శోభిత్ శ్రీవాస్తవకు ఆ వేషం దక్కింది. ఇప్పుడతను దేశమంతా తెలిశాడు. ఇక నిన్న మొన్నటివరకూ లండన్ బాత్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థిని అనుప్రియ నాగర్ అనుకోకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయి సూపర్‌హిట్ తన ఖాతాలో వేసుకుంది. ‘బాబానే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు’ అని ఆమె కృతజ్ఞతతో పులకించిపోతోంది. కొన్ని సినిమాలు ప్రజల వద్దకు గొప్ప ఆదరణతో చేరడం అన్నింటికంటే పెద్ద మిరాకిల్. ఆ మిరాకిల్‌లో ఒక భాగమైంది అనుప్రియ నాగర్.నీమ్ కరోలి బాబాఎప్పుడూ ఒంటి మీద కంబళితో కనిపించే నీమ్ కరోలిబాబా హనుమంతుడి పరమ భక్తుడిగా జీవించి 1973లో లోకాన్ని వీడారు. ఆయన జీవితకాలంలో, తర్వాత ఆయన సన్నిధి వద్ద భక్తులు ఎన్నో దివ్య అనుభవాలు పొందిన కథనాలు ఉన్నాయి. ఆయన ఆశ్రమానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ‘ప్రేమించు’, ‘సేవ చెయ్’ అని ఉపదేశించిన బాబా జీవితాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు బాబా చేసిన పనులను కేవలం ‘చమత్కారాలు’గా కాకుండా, భగవంతుని ‘లీలలు’గా చూపించడం ప్రేక్షకులను విపరీతంగా కట్టి పడేసింది. డిజాస్టర్ టాక్ ‘హనుమాన్ అంశ్’ విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమాను ఇండస్ట్రీ ‘డిజాస్టర్’ అని డిక్లేర్ చేసింది. ‘మొదటిరోజు 355 షోలతో ప్రారంభమైన మా సినిమా ఎనిమిదో రోజుకు 29 షోలకు పడిపోయింది. పెద్ద సినిమాల్లా ప్రమోషన్స్ చేయడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. థియేటర్ల నుంచి తీసేస్తారనుకున్న టైమ్‌లో సినిమా చూసిన ప్రేక్షకులే పెద్ద విప్లవాన్ని తెచ్చారు. మూడోవారం నుంచి ఊహించని విధంగా పబ్లిక్ టాక్‌తో కలెక్షన్లు పెరిగి 156 కోట్లకు చేరాయి. ప్రేక్షకులే ఈ సినిమాకు పీఆర్ టీమ్‌గా మారి గెలిపించారు. ప్రేక్షకులు స్వయంగా వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తూ థియేటర్లకు క్యూ కట్టారు. కలెక్షన్లు ఒక్కసారిగా 22 శాతం పెరిగి, చూస్తుండగానే 150 కోట్ల మార్కును దాటేసింది’ అంది అనుప్రియ. స్టీవ్ జాబ్స్ ఇచ్చిన ఐడియాఅనుప్రియ నాగర్ తన చదువులో భాగంగా టెక్ కంపెనీల గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆపిల్ సంస్థ స్టీవ్ జాబ్స్‌కు, ఫేస్బుక్ జుకర్‌బర్గ్‌కు నీమ్ కరోలిబాబా ఆశీర్వాదం ఉందని తెలుసుకుంది. స్టీవ్‌జాబ్స్, జుకర్‌బర్గ్ తమ కెరీర్లు మొదలెట్టడానికి ముందు నైనిటాల్‌కు సమీపంలో ఉన్న నీమ్ కరోలిబాబా ఆశ్రమస్థలం ‘కైంచిధామ్’కు వెళ్లి వచ్చినవారే. ‘అరె... నా దేశంలోని ఒక ఆధ్యాత్మిక గురువు గురించి విదేశీయుల ద్వారా నేను తెలుసుకోవాలా? నా దేశస్తులకు ఈ ఆధ్యాత్మిక గురువు గురించి నేను చెప్పాలి. ముఖ్యంగా జెన్ జికి చెప్పాలి’ అనుకుంది అనుప్రియ. అప్పటినుంచి బాబా గురించి తెలుసుకుంటూ ఆయనపై పుస్తకం రాయాలని ఇండియా చేరుకుంది. అప్పటికే దర్శకుడు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్’ పేరుతో బాబా మీద సినిమాను దాదాపు పూర్తిచేసి నిధుల కొరతతో ఉన్నాడని తెలుసుకుని తనే నిర్మాతగా మారింది.సమాజానికి ఇవ్వడమే...ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారు అని అడిగితే ‘నేను 21 ఏళ్ల అమ్మాయిని. ఇంత డబ్బు నేనేం చేసుకుంటాను? సమాజానికి తిరిగి ఇచ్చేస్తాను. పిల్లల విద్య, వైద్యం కోసం ఒక ప్రత్యేక ఫౌండేషన్ పెడుతున్నాను’ అని ప్రకటించింది అనుప్రియ. భవిష్యత్తులో కూడా కేవలం భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలపైనే సినిమాలు తీస్తానని బాస చేసింది. ఒక సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సమాజ హితవుకు అవసరమైన మార్పు కోసం పని చేయడమే మిగిలింది. -
‘హనుమాన్ అంశ్2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?
బాలీవుడ్లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ సినిమా పేరు మార్మోగుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది. ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రానున్న ‘హనుమాన్ అంశ్2’, ‘హనుమాన్ అంశ్3’పై ఆసక్తి పెరిగింది. పార్ట్2లో పలువురు ప్రముఖులు నటించనున్నారని వస్తున్న వార్తలపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి.నిర్మాత ఏమన్నారంటే..‘హనుమాన్ అంశ్2’లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రల్లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికరంగా స్పందించారు. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పార్ట్2 కథ పలువరి సెలబ్రిటీలకు తెలుసునని తెలిపారు. అయితే విరాట్, అనుష్క ఇద్దరూ సినిమాలో నటించేందుకు అంగీకరించారా లేదా అని మాత్రం ఆమె స్పష్టంగా తెలపలేదు.చదవండి: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?కాగా విరాట్-అనుష్కలకు నీమ్ కరోలి బాబాపై ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు సందర్భాల్లో కైంచీ ధామ్‌ను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్ అంశ్’లో వీరిద్దరినీ భాగం చేయాలనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మూడు భాగాలుగా..ఇక ‘హనుమాన్ అంశ్’ను మొదటి నుంచే మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినట్లు నిర్మాత తెలిపారు. ‘తొలి భాగంలో నీమ్ కరోలి బాబా ప్రారంభ జీవితం నుంచి కైంచీ ధామ్( ఆధ్యాత్మిక ఆశ్రమం) వరకు చూపించాం. రెండో భాగం కైంచీ ధామ్, అక్కడి భారతీయ భక్తుల కథలపై తెరకెక్కిస్తాం. మూడో భాగంలో బాబా ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని చూపించబోతున్నాం’ అని తెలిపారు. అయితే విరాట్-అనుష్కలు ఇందులో కనిపిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా? -
దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్‌లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్)ప్రేక్షకుల ఆదరణతో..‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్‌తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి. -
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్‌కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. 25 షోలకు పడిపోయాం‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్‌లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.బాలీవుడ్ నుంచి సాయం..‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ


