కైన్చీ ధామ్‌ వెళ్లే ముందు.. ‘హనుమాన్ అంశ్‌’ దర్శకుని కీలక సూచన | Hanuman Ansh Director Urges Devotees to Check Kainchi Dham Conditions | Sakshi
Sakshi News home page

కైన్చీ ధామ్‌ వెళ్లే ముందు.. ‘హనుమాన్ అంశ్‌’ దర్శకుని కీలక సూచన

Oct 5 2026 8:44 AM | Updated on Oct 5 2026 8:44 AM

Hanuman Ansh Director Urges Devotees to Check Kainchi Dham Conditions

కైన్చీ ధామ్‌: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కైన్చీ ధామ్‌కు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. కైన్చీ ధామ్‌లో ప్రస్తుతం పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే అక్కడికి వెళ్లాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉంటే సమీపంలోని ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని కోరారు.

నీమ్ కరోలి బాబా నడయాడిన కైన్చీ ధామ్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి. 1964లో నీమ్ కరోలి బాబా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయనను భక్తులు హనుమంతుడి అవతారంగా భావిస్తారు. ‘హనుమాన్ అంశ్‌’ సినిమా విడుదలైన తర్వాత ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆదివారం సాయంత్రం దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. కైన్చీ ధామ్‌లో ప్రస్తుతం భారీ రద్దీ ఉందని తెలిపారు.

సినిమా చూసిన తర్వాతే ప్రజలు అక్కడికి వస్తున్నారనే ప్రచారం ఉందని పేర్కొంటూ.. అది నిజమైనా, కాకపోయినా క్షేత్రంలోని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే వెళ్లాలని సూచించారు. కైన్చీ ధామ్‌లో రద్దీ ఎక్కువగా ఉండి, గంటల తరబడి క్యూలు ఉంటే ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని దర్శకుడు సూచించారు. నీమ్ కరోలి గ్రామం, బృందావనం వంటి ప్రాంతాలను కూడా భక్తులు సందర్శించవచ్చని సూచించారు. భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ముందస్తు సమాచారం తెలుసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యం: ఆరేళ్ల తర్వాత మళ్లీ అధ్వాన్నం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement