ఏలూరులో అర్చకుడిపై టీడీపీ నేత దాడి | TDP Eithakota Srinivas Attacking Priest Inside Eluru Temple | Sakshi
Sakshi News home page

ఏలూరులో అర్చకుడిపై టీడీపీ నేత దాడి

Nov 22 2026 7:30 AM | Updated on Nov 22 2026 7:30 AM

TDP Eithakota Srinivas Attacking Priest Inside Eluru Temple

ఆలయ ప్రాంగణంలో బూట్లతో దర్జాగా తిరుగుతున్న ట్రస్ట్‌బోర్డు సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్రం ఏలూరులో ఓ అర్చకుడిపై ట్రస్ట్‌బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు దాడి చేయడం కలకలం రేపింది. ఏలూరు ఆర్‌ఆర్‌పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మహా­దాస్యం రామచంద్రాచార్యులు (చందు) అర్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారికి నిత్యం తానే నైవేద్యం నివేదిస్తారు. 

అనంతరం భక్తులకు పంపిణీ చేస్తారు. శనివారం కూడా ఆయన యథావిధిగా ప్రసాద వితరణ చేస్తుండగా.. కొందరు భక్తులు వచ్చి స్వయంపాకం సమర్పిస్తామని చెప్పగా ఆయ­న వారి వద్దకు వెళ్లారు. దీంతో కొద్దిసేపు ప్రసాద వితరణ నిలిచిపోగా.. కొందరు వ్యక్తులు ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యుడిగా ఉన్న టీడీపీ నాయకుడు ఈతకోట శ్రీనివాసరావుకు ఫోన్‌లో చెప్పారు. దీనిపై ఆగ్రహించిన ఆయన చందును ఫోన్‌లోనే దుర్భాషలాడారు. దీనికి చందు సమాధానమివ్వగా ఆగ్రహించిన శ్రీనివాసరావు కాళ్లకు బూట్లతోనే పవిత్ర మండపంలోకి చేరుకుని ‘నా మాటకే ఎదురు చెబుతావా’ అంటూ అర్చకుడిపై చేయిచేసుకున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన ఆలయ ప్రాంగణం నుంచి జారుకున్నారు.   

దుర్మార్గమైన చర్య: జేపీ 
ఆలయంలో వేదం చదివే బ్రాహ్మణుడిపై భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ (జేపీ) అన్నారు. అర్చకస్వామికి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ధర్మకర్తల మండలి నుంచి శ్రీనివాసరావును బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement