కూటమి కుట్రలకు వైఎస్సార్‌సీపీ చెక్‌ | Chittoor YSRCP Corporator Harini Reddy Resigns Before Taking Oath | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలకు వైఎస్సార్‌సీపీ చెక్‌

Nov 22 2026 7:26 AM | Updated on Nov 22 2026 7:26 AM

Chittoor YSRCP Corporator Harini Reddy Resigns Before Taking Oath

సాక్షి, చిత్తూరు: చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతల కుట్రలను వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పికొట్టారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఏకంగా 51 డివిజన్లలో కార్పొరేటర్లు ఏకగ్రీవం కావడంతో చిత్తూరు వార్తల్లో నిలిచింది. నామినేషన్లు వేసిన అభ్యర్థులు వాళ్ల ప్రతిపాదకులతో కలిసి బయట ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వాటిని ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారులకు లేఖలు అందడం.. ఎవరూ పోటీలో లేకపోవడంతో 51 డివిజన్లలో కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలిచినట్లు అధికారులు ప్రకటించడం తెలిసిందే. 

ఏకగ్రీవమైన స్థానాల్లో టీడీపీ 47, బీజేపీ 1, జనసేనలో ఇద్దరు ఉన్నట్లు ప్రకటించడంతో పాటు పనిలో పనిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని హరిణిరెడ్డి సైతం ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు. ఇలా చేస్తే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని ఇరకాటంలో పడేయవచ్చని టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. కానీ, వీరి కుట్రలను గ్రహించిన హరిణిరెడ్డి.. తన కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేస్తూ తాజాగా  నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ను శనివారం కలిసి రాజీనామా పత్రాన్ని అందచేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement