జాతీయ స్థాయి పోటీలకు వెదురుకుప్పం విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు వెదురుకుప్పం విద్యార్థిని

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

వెదురుకుప్పం : జాతీయ స్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని గౌతమి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు శివశంకరయ్య శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పంజాబ్‌లోని భటీంఢాలో ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున గౌతమి పాల్గొంటుందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. అనంతరం పీడీ రమేష్‌ను అభినందించారు.

ఉత్తమ మత్స్యకారులకు అవార్డులు

నగరి/ నిండ్ర (నగరి) : జిల్లా ఉత్తమ మత్స్యకారులుగా నగరి చెందిన శరవణన్‌, నిండ్రకు చెందిన శివలింగం అవార్డులు అందుకున్నారు. ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు జిల్లా ఉద్యానవన శాఖ భవనంలోని రైతు శిక్షణ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శరవణన్‌, శివలింగానికి జిల్లా మత్స్యశాఖ అధికారి జ్యోత్స్న ప్రమోద మల్లి పురస్కారాలు అందజేశారు. కృష్ణాపురం ఫిష్‌ సీడ్‌ ఫామ్‌ మత్స్య అభివృద్ధి అధికారి రామ్మోహన్‌, సహాయకులు హిమావత్‌, మైఖేల్‌ పాల్గొన్నారు.

వరసిద్ధుని సేవలో

సమాచార కమిషనర్‌

కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని సమాచార కమిషనర్‌ చావలి సునీల్‌ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సేవించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement