చిత్తూరు కలెక్టరేట్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్న దివ్యాంగ క్రీడాకారుల ఎంపిక పోటీల పోస్టర్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలన్నారు. క్రీడాకారులు తమ అద్భుత ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తామని నమ్మించి, మరో వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దించడంతో మనస్తాపం చెందిన టీడీపీ నేత ఒకరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం శ్రీరంగరాజపురంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. శ్రీరంగరాజపురం పంచాయతీకి చెందిన కుమార్‌నాయుడు స్థానికంగా టీడీపీ కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టారు. ఆయనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తామని మండల నేతలు హామీ ఇచ్చారు. చివరకు వేరే వ్యక్తికి సర్పంచ్ అభ్యర్థిగా టీటీడీ మద్దతు తెలపడంతో కుమార్‌నాయుడు పురుగుల మందు తాగేశారు. కుటుంబీకులు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు.
జగనన్న కోసం
శబరిమలై యాత్ర
పలమనేరు : మండలంలోని టి.వడ్డూరుకు చెందిన లక్ష్మయ్య అనే యువకుడు జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, వెంకటేగౌడ మళ్లీ ఎమ్మెల్యే కావాలని అయ్యప్ప మాల ధరించి శబరిమలై యాత్రకు వెళ్లాడు. శనివారం ఈ మేరకు అయ్యప్పను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతల అక్రమాలను చూసి, అరాచక పాలన అంతం కావాలని మొక్కుకుని అయ్యప్ప మాల ధరించినట్లు వెల్లడించాడు.
విద్యార్థులకు అభినందన
శ్రీరంగరాజపురం : మండలంలోని నెలవాయిలో ఉన్న ఇండో జర్మన్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి సి.హన్సిత్, 8వ తరగతి విద్యార్థిని సి.మహిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు గ్రేస్ శనివారం తెలిపారు. ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఆరిమాకులపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సెపక్ తక్రా జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మహేష్, సాయి, నిరంజన్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ పెట్టుబడి..
రూ.37 లక్షలు అవుట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఆన్‌లైన్‌లో పెట్టుబడి పేరిట ఓ యువకుడు రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. శనివారం ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన జస్వంత్ విదేశాల్లో చదువుకునేందుకు ఓ బ్యాంకు నుంచి గత ఏడాది ఏప్రిల్‌లో రూ.37 లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆన్‌లైన్ పెట్టుబడుల ప్రకటనలు జస్వంత్‌ను ఆకర్షించాయి. ఈ క్రమంలో భారీగా లాభాలు ఆర్జించవచ్చని పలు దఫాలుగా మొత్తం రుణ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పెట్టుబడిగాపెట్టాడు. చివరకు నగదు మొత్తం పోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ సయ్యద్ హసన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటితో డిగ్రీ స్పాట్
అడ్మిషన్లకు చివరి గడువు
తిరుపతి సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ కళాశాలల్లో పలు యూజీ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగియనుంది. 23న ఆయా కళాశాలలకు అందిన దరఖాస్తులను పరిశీలించి కళాశాల యాజమాన్యాలు ఫైనల్ లిస్ట్‌ను 24వ తేదీ ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైటల్ నమోదు చేయనున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల యాజమాన్యాలు సూచించారు.


