హెచ్‌ఐవీ నియంత్రణలో భేష్‌ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ నియంత్రణలో భేష్‌

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

● వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించిన కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన 95,95,95 లక్ష్యాలను విజయవంతంగా సాధించడంతో జిల్లాకు ప్రతిష్ఠాత్మక ‘సురక్షిత్‌’ హోదా దక్కిందని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడం, వైరస్‌ నియంత్రణ వంటి మూడు కీలక అంశాల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించారు. అత్యుత్తమ పనితీరుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ నాగ శశి భూషణ రెడ్డి, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారన్నారు. డిసెంబర్‌ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో చేపట్టే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు, ఏఆర్‌టీ చికిత్సా సేవలు, వైరస్‌ నియంత్రణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అంకితభావానికి, సమష్టి కృషికి ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని కలెక్టర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement