గాయపడిన ఏజెంట్‌కు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

గాయపడిన ఏజెంట్‌కు పరామర్శ

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

– 8లో

– 8లో

– 8లో

చిత్తూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పచ్చమూక దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ను విజయానందరెడ్డి పరామర్శించారు.

విద్యార్థులకు అభినందన

ఎస్‌ఆర్‌పురం నెలవాయిలోని ఇండో జర్మన్‌ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

సాక్షి, చిత్తూరు : తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేయడం, పరిశీలన, ఉప సంహరణ పూర్తయ్యింది. ఈనెల 26వ తేదీ జరగనున్న ఎన్నికల్లో పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో ఉన్న 182 సర్పంచ్‌ స్థానాలు, 1,908 వార్డు సభ్యుల స్థానాలకు 2,976 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక రెండో విడతలో పూతలపట్టు నియోజకవర్గంలోని అయిదు మండలాలతో పాటు పులిచెర్ల, రొంపిచెర్ల, నగరి, నిండ్ర మండల్లోని మొత్తం 253 పంచాయతీలు, 2,282 వార్డులకు నామినేషన్లు వేయడానికి ఇప్పటికే గడువు ముగియగా.. శనివారంతో పరిశీలన పూర్తయ్యింది. 24న ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుస్తాయి. 29న పోలింగ్‌ నిర్వహిస్తారు. చివరి దశ ఎన్నికలకు చిత్తూరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో శనివారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ.. 23వ తేదీ వరకు కొనసాగుతుంది. 27న ఉపసంహరణ, డిసెంబరు 2న ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో ఒక్కసారిగా పల్లె రాజకీయాలు వేడెక్కాయి.

నిస్తేజంలో నాలుగో సింహం

మున్సిపల్‌, ప్రాదేశిక పోరులో అధికార పక్షం చేసిన గూండాగిరీ, దౌర్జన్యకాండను చూసి ప్రజలు నివ్వెరపోయారు. ఇవే పాఠాలుగా గుర్తించి, పల్లె సంగ్రామంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసుశాఖ పరువు నిలబెట్టుకునేలా పనిచేస్తుందని అందరూ భావించారు. కానీ జిల్లాలో ఇటీవల జరిగిన దాడులు చూస్తుంటే నాలుగో సింహానికి ఏమైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతి పక్ష అభ్యర్థులపై దాడులు జరిగినా, నామినేషన్లు చించివేసినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇలాంటి అభద్రతాభావం మధ్య పోలింగ్‌ రోజున పోలీసు శాఖ ఎలా పనిచేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కూడా అధికారపార్టీ నేతల చేష్టలకు దాసోహమంటూ సాగిల బడుతుందా..? ఖాకీ యూనిఫామ్‌ ప్రతిష్ట ఇనుమడించేలా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తుందో..? పచ్చమూకకు వంత పాడుతుంతో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement