పూతలపట్టు(యాదమరి): పంచాయతీ ఎన్నికల్లో పూతలపట్టు మండలం తలపులపల్లె పంచాయతీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. సుమారు 50 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ, గ్రామస్తుంలతా ఏకతాటిపై నిలిచి సర్పంచ్‌తో పాటు 8 వార్డు స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు తలపులపల్లి బాబురెడ్డి, తరుణ్‌రెడ్డి సూచన మేరకు గ్రామ పెద్దలతో పాటు ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థి రామాంజులమ్మ సర్పంచ్ స్థానానికి ఒక్కరే నామినేషన్ వేశారు. మరో నామినేషన్ రాకపోవడంతో ఆమెకు సర్పంచ్ పీఠం దక్కడం లాంఛనంగా మారింది. అలాగే 8వార్డు స్థానాలకు కూడా ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే పంచాయతీ పాలకవర్గం కొలువుదీరనుంది.


