బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి భారతి స్పష్టం చేశారు. పోక్సో చట్టం–2012పై దేశవ్యాప్త అవగాహన ప్రచారంలో భాగంగా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో సురక్షిత బాల్యం– బాలల రక్షణ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని అంబేద్కర్‌ భవన్‌న్‌లో చిత్తూరు మహిళా కళంజియం, మహిళా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, వారి హక్కులను పరిరక్షించడంతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. వరకట్న నిషేధ చట్టం, పోక్సో చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. సమాఖ్య కో–ఆర్డినేటర్‌ గురమ్మ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ విష్ణుశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement