సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలపై ఆ రెండు సంస్థలకు అవగాహన లేదని ఆయన ఆరోపించారు. ఎలిఫెంటా గుహల్లోని అర్ధనారీశ్వర శిల్పం ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కులతత్వం, పురుషాధిక్య భావజాలంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
The deeper I go into Indian spiritual and religious traditions, the clearer it becomes. The BJP and RSS are uncouth, greedy, casteist male chauvinists with absolutely no understanding of our spiritual and religious traditions. https://t.co/CrJxkEXNgI
— Rahul Gandhi (@RahulGandhi) November 22, 2026
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా స్పందించారు. హిందువులను హింసాత్మకులుగా అభివర్ణించిన రాహుల్.. భారతీయ సంప్రదాయాలపై పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సనాతన ధర్మంపై ఆయనకు ద్వేషం ఉందని విమర్శించారు.
ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల కార్యక్రమంలో రాహుల్ చేసిన ‘భోజనం సమయంలో అమ్మ నాన్న ఒడిలో కూర్చునేది’ అనే వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పించారు.
అంతకుముందు శివుడి ఒడిలో పార్వతి ఉన్న శిల్పాన్ని షేర్ చేసిన రాహుల్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిజమైన హిందువుగా వారిని ఆ భావాల నుంచి విముక్తి చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. మనుషులను శివపార్వతులతో పోల్చడం భక్తి కాదని విమర్శించారు.
ఇదీ చదవండి: ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారాన్ని ప్రారంభించిన సీజేపీ


