మంత్రి నిమ్మల వర్సెస్‌ జనసేన ఎమ్మెల్యే నాయకర్‌ | Minister Nimmala Vs Janasena MLA Nayakar West Godavari | Sakshi
Sakshi News home page

మంత్రి నిమ్మల వర్సెస్‌ జనసేన ఎమ్మెల్యే నాయకర్‌

Nov 22 2026 8:47 PM | Updated on Nov 22 2026 8:47 PM

Minister Nimmala Vs Janasena MLA Nayakar West Godavari

పశ్చిమగోదావరి జిల్లా: జిల్లా కూటమిలో కోల్డ్‌వార్‌ మొదలైంది. అది కూడా  పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు వర్సెస్‌ నరసాపురు జనసేన ఎమ్మెల్యే నాయకర్‌ మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి.  పంచాయతీ అభ్యర్థి ప్రచారంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేసిన హాట్‌ కామెంట్స్‌ విభేదాలు వెలుగుచూశాయి. 

తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో నిధులు ఎలా కేటాయిస్తారంటూ మంత్రి నిమ్మలను నాయకర్‌ ప్రశ్నించారు. నిమ్మల చర్యలతో నియోజకవర్గ ఎమ్మెల్యే నైన తన మాటే ఎవరూ వినడం లేదని ఓటర్ల వద్ద ఆవేదన చెందారు బొమ్మిడి నాయకర్‌. 

తనకు వ్యతిరేకంగా కొత్తపాలెం గ్రామంలో వేరే సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టడంపై ఎమ్మెల్యే  అసహనం వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు అయినా జెడ్పీటీసీ అయినా తనను కాదని ఏ అభివృద్ధి చేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే తాను చెప్పిన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరిన ఎమ్మెల్యే నాయకర్ ఓటర్లను కోరారు. 

ఇదీ చదవండి: బుట్టాయిగూడెంలో జనసేనకు షాక్

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement