పక్కా ప్లానింగ్‌తో బెంగళూరుకు ఎగేసుకుని వెళ్లిన ఎల్లో మీడియా | TDP media frenzy in Bengaluru for sharmila arriving | Sakshi
Sakshi News home page

పక్కా ప్లానింగ్‌తో బెంగళూరుకు ఎగేసుకుని వెళ్లిన ఎల్లో మీడియా

Nov 22 2026 7:25 PM | Updated on Nov 22 2026 7:27 PM

 TDP media frenzy in Bengaluru for sharmila arriving

బెంగళూరులో ఎల్లో మీడియా ఎక్కడాలేని హడావుడి చేస్తోంది. యలహంకలోని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి బయట పచ్చ మీడియా హల్‌చల్‌ చేస్తోంది. ప్రీ ప్లానింగ్ స్టఫ్ కోసం ఉదయం నుంచే వెయిట్ చేసింది ఎల్లో మీడియా. పక్కా ప్లానింగ్‌, వ్యూహాలతో ఎల్లో మీడియా మొత్తం యెలహంక ఇంటి వద్ద ఉంది.

షర్మిల అక్కడకు వెళ్లకుండా కోర్టు ఆర్డ‌ర్స్ ఉన్నప్పటికీ ఆమె పట్టించుకోకపోవడంతో.. బెంగళూరులో యలహంక ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. యలహంక నివాసం వైపు వెళ్లడానికి కోర్టు అనుమ‌తిలేద‌ని తెలిసి కూడా ఆమె అక్కడకు వస్తారని ముందుగానే పసిగట్టిన ఎల్లో మీడియా కెమెరాలు, మైకులతో నానా హంగామా చేయడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది. శాంతిభద్రతల సమస్య సృష్టించొద్ద‌ని క‌ర్ణాట‌క‌ పోలీసులు ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ వాటిని కూడా ఎల్లో మీడియా పట్టించుకోలేదు.

ఇప్పటికే షర్మిలతో పాటు చంద్రబాబు అండ్‌ కో పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తూ వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగతంగా బురద చల్లే ‍ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం బెంగళూరులోని వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు ఆందోళన చేయబోతున్నారన్న విషయం ఎల్లో మీడియాకు ఎ‍ప్పటిలాగే ముందుగానే తెలిసింది. శనివారం ఈ విషయంపైఅదే పనిగా బ్రేకింగులు వేసి చూపింది. అంతకంటే ముందే చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట‍్టారు. చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుట్రలో భాగంగానే షర్మిల ఈ డ్రామా చేస్తుందని తేలిపోయింది. షర్మిల తనకు చెందని, హక్కులేని ఆస్తుల కోసమే కాకుండా అంతకు మించి రాజకీయ ఆకాంక్ష కోసం పదే పదే ఆరాటపడుతున్నారు.

చంద్రబాబు నాయుడి కుట్రలు కుటుంబాల్లోనూ చిచ్చులు పెట్టేలా ఉంటాయి. ఇటీవల ‘‘సాక్షి’’లో వచ్చిన ‘‘చెట్టపట్టాల్‌’’ అన్న పదంపై షర్మిలతో పాటు నారా లోకేశ్‌ కూడా అనవసర రాద్ధాంతం చేస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అలాగే, స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేసిన కుట్రలు అన్నీఇన్నీ కాదు. అందుకు కూడా ఎల్లో మీడియాను బాగావాడుకున్నారు. వాటి నుంచి డైవర్షన్‌ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిలతో ఈ డ్రామాలు ఆడిస్తున్నారు చంద్రబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement