నామినేషన్ వేసేందుకు వెళ్లిన న్యాయవాదిపై హత్యాయత్నం | Panchayat Poll Violence: TDP Cadre Attacks Sarpanch Aspirant in Prakasam District | Sakshi
Sakshi News home page

నామినేషన్ వేసేందుకు వెళ్లిన న్యాయవాదిపై హత్యాయత్నం

Nov 22 2026 2:54 PM | Updated on Nov 22 2026 3:01 PM

Panchayat Poll Violence: TDP Cadre Attacks Sarpanch Aspirant in Prakasam District

సాక్షి,ప్రకాశం: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొనకనమిట్ల మండలంలో టీడీపీ శ్రేణులు పేట్రేగిపోయాయి. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ఓ న్యాయవాదిపై మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డాయి.

చినారికట్ల గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు శుక్రవారం సాయంత్రం తన మద్దతుదారులు మోరబోయిన మురళీకృష్ణ, ఏలూరి సంజీవరెడ్డిలతో కలిసి పెదారికట్ల గ్రామ సచివాలయానికి వెళ్లిన న్యాయవాదిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. సచివాలయాన్ని చుట్టుముట్టిన ప్రత్యర్థులు ఆయన చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న న్యాయవాది లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ ప్రక్రియ ముగించుకుని రెడ్డెం వెంకటరెడ్డి, ఏలూరి సంజీవరెడ్డి, తోట శ్రీనులతో కలిసి కారులో చినారికట్లకు బయలుదేరగా, మార్గమధ్యంలోని టైర్ల షాపు వద్ద బాపతు కృష్ణారెడ్డితో పాటు మరికొందరు కర్రలు, ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో కారుకు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కంది వెంకటరెడ్డి అనే వ్యక్తి గొడ్డలిని విసరగా న్యాయవాది తృటిలో తప్పించుకోగా, మిగిలిన వారంతా కారును చుట్టుముట్టి అద్దాలు, బాడీని పగులగొడుతూ హత్యాయత్నానికి పాల్పడ్డారు.

దాడి జరుగుతున్న సమయంలో స్థానికులు అప్రమత్తమై అడ్డుకోవడంతో తనకు పెను ప్రమాదం తప్పిందని బాధితుడు వాపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తున్న తనపై దాడికి పాల్పడి కారును ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకొని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement