విజయనగరం: అధికార బలం ఉంటే ఏది చేసినా సాగిపోతుందనేందుకు రాజాం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల తంతే నిలువెత్తు నిదర్శనం. నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఓటులేని వ్యక్తి పేరును ఓటరు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటరు జాబితాలో చేర్చడం, చైర్‌పర్సన్ అభ్యరి్థగా నామినేషన్‌కు ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఆగడాలకు.. రాజాం మున్సిపల్ ఎన్నికల అధికారుల వత్తాసు తోడైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాజిక న్యాయం అంటూ బాకా ఊదుతున్న జనసేన పార్టీ ఢిల్లీలో ఉండే బేరి సౌజన్యలతకు రాజాం చైర్‌పర్సన్ అభ్యరి్థగా బొట్టుపెట్టింది. ఈమె పేరుతో నామినేషన్లు వేసేరోజువరకూ ఓటరు జాబితాలో ఓటు లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఎన్నికల «అధికారులు జాగ్రత్తలు పాటించారు. చివరి నిమిషంలో హైకోర్టు, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయని, 16వ వార్డులో చివరి సంఖ్య 1022 ¯నంబర్‌తో ఈమె ఎపిక్‌ను యాడ్ చేశారు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్న ఓటర్లకు ఈమె పేరు ఇప్పటికీ కనిపించడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి మాన్యువల్‌గా పబ్లిష్ చేసిన జాబితాలో మాత్రం ఆమె పేరు కనిపిస్తోంది.

రాజాంలో 16వ వార్డులో గత నెల 24న ప్రచురించిన ఆన్‌లైన్ జాబితాలో కనిపించని బేరి సౌజన్యలత పేరు
అన్నీ తప్పులు తడకలే...
బేరి సౌజన్యలత ఓటరును ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు రాజాం పట్టణ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందో? లేదో? చూడాలని హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు ఈ నెల 12న ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల కమిషన్ ఈ నెల 13న మున్సిపల్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆమె ఓటును రాజాం పట్టణ ఓటరు జాబితాలో చేర్చేందుకు అవకాశం లేదు. 14 నుంచి నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఈలోగానే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావుతో పాటు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి హడావిడిగా ఆమె పేరును 16వ వార్డులో చివరి వరుస సంఖ్య 1022తో చేర్చారు. నామినేషన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా తేల్చేశారు. దీనికోసం రూ.లక్షల్లో నజరాన అందుకున్నట్టు సమాచారం.

చేర్పులుచేసి అదే ఓటరు జాబితాలో చివరి వరుస సంఖ్యతో సౌజన్యలత పేరును చేర్చిన అధికారులు
పొంతనలేని సమాధానాలు
ఓటరు జాబితాలోకి వచ్చిన సౌజన్యలత ఓటరు కార్డు ఎపిక్ నంబర్ ఏక్యూడబ్ల్యూ2255784 ఈఏడాది అక్టోబర్ 24న మంజూరు చేసినట్లు ఎన్నికల వెబ్‌సెట్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు చూపిస్తున్నారు. బీఎల్‌ఓ సురేష్ సెపె్టంబర్ 15న ఓటరు కార్డు ఇచ్చామని వెల్లడించారు. కమిషనర్ రామచంద్రరావు కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 24న పబ్లిష్ చేసిన ఓటరు జాబితాలో ఉందని వివరణ ఇస్తున్నారు. మరో వైపు హైకోర్టు ఈనెల 12న ఆదేశాలు ఇవ్వగా, 13న ఎన్నికల కమిషన్ మున్సిపల్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేసింది. ఈ తేదీలు కంటే ముందు ఈమె ఓటు 16వ వార్డులోకి ఎలా వచ్చిందనేది మిలియన్ డాలర్లు ప్రశ్నగా మారింది. ఇంకో వైపు హైకోర్టు ఆదేశాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఓటరు పేరు చేర్చే ప్రక్రియ జరిగితే నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే వదిలేయాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. వీటిని భేఖాతరు చేస్తూ కమిషనర్‌తో పాటు ఇక్కడి అధికారులు పెద్దఎత్తున రాజాం పట్టణ ఓటర్లను మోసగించడమే కాకుండా, అటు కోర్టు ఆదేశాలను ధిక్కరించారని తెలుస్తోంది.
కోర్టు ఆదేశాల మేరకే...
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బేరి సౌజన్యలత హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చిందని, అందుకే ఆమె ఓటును ఓటరుజాబితాలో చేరి్పంచామన్నారు. ఎప్పుడు ఆదేశాలు వచ్చాయనేది చెప్పేందుకు నిరాకరించారు. ఇప్పుడు నామినేషన్లు పూర్తయ్యాయని, ఈ విషయాలు ఎందుకు బయటపెట్టడం అంటూ సమాధానం దాటవేశారు.
అసలు కథ ఇదీ..
హైకోర్టు నోటీసు మేరకు తనను ఓటరుగా రాజాం పట్టణ జాబితాలో చేర్చాలని మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సౌజన్యలత కుటుంబీకులకు తొలుత అధికారులు పేరు చేర్చడం జరుగదని, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారని తేల్చేసారు. ఇంతలోనే రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రంగప్రవేశం చేసి ఓటరు పేరు చేర్చేందుకు మధ్యవర్తులను కార్యాలయానికి పంపించారు. ఇక్కడే బేరసారాలు చేసి పేరు చేర్చేందుకు అధికారులు అంగీకరించారు. కోర్టు నుంచి సరైన ఆదేశాలు లేకపోవడంతో, భవిష్యత్తులో నామినేషన్‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సెప్టెంబర్ 15న ఆమె పేరు ఇక్కడ ఓటరుగా నమోదైనట్లు పత్రాలు సృష్టించారు. వాస్తవంగా సర్ పక్రియ జరుగుతుండడంతో కొత్తగా ఓటరు చేర్పులు వెంటనే జరగలేదు. కొత్తగా వచ్చిన దరఖాస్తులో ఏ ఒక్కరి ఓటును ఈ జాబితాలో చేర్చలేదు. కానీ, ఇక్కడ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చెందిన కొంతమంది ఉద్యోగులు చక్రం తిప్పి ఈమె పేరును మాన్యువల్‌గా ఓటరు జాబితాలో చేర్చారు. ఆ తరువాత వచ్చిన కోర్టు ఆదేశాలను చూపిస్తూ అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇటు రాజాం ఓటర్లను అమాయకులను చేశారు.



