మెడలో మంగళసూత్రం రాయలేదని నామినేషన్‌ తిరస్కరణ | nomination Rejection Female Sarpanch candidate | Sakshi
Sakshi News home page

మెడలో మంగళసూత్రం రాయలేదని నామినేషన్‌ తిరస్కరణ

Nov 22 2026 11:52 AM | Updated on Nov 22 2026 11:57 AM

 nomination Rejection Female Sarpanch candidate

వరికుంటపాడులో బ్యాంక్‌ మేనేజర్‌ను చుట్టుముట్టిన గ్రామస్తులు

నెల్లూరు (పొగతోట): గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో విడతలో ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్, కాకర్ల సురేష్‌లు శిఖండి రాజకీయాలు సాగిస్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎన్ని అడ్డదారులు తొక్కినా.. వైఎస్సార్‌సీపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజాదరణ చూసిన వీరు.. పంచాయతీ ఎన్నికల్లో అంతకు మించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. చివరికి మహిళా అభ్యర్థులను చూసి వణికిపోతున్నారు. సీతారామపురంలో సర్పంచ్‌ అభ్యర్థి మెడలోని మంగళసూత్రాన్ని కనబరచలేదని ఆమె నామినేషన్‌ తిరస్కరించే స్థాయికి దిగజారిపోయారు. 

మరో మహిళ సర్పంచ్‌ అభ్యర్థి ఖాతాలో కనబరిచిన మొత్తం కంటే తక్కువ ఉందని రిజెక్ట్‌ చేసిన నీచానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోలీస్‌ అధికారి ఏకంగా బ్యాంక్‌ మేనేజర్‌ను బెదిరించడం బయట పడింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఆర్వోలు తమ ఉద్యోగ భవిష్యత్‌ను పణంగా పెట్టి పచ్చపాత ధోరణితో వ్యవహరించారు. అధికార పారీ్టకి అనుకులంగా వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్లు రిజక్ట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు 14 మండలాల్లో జరుగుతున్నాయి. 197 గ్రామ పంచాయతీలు, 2714 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. 

సర్పంచ్‌లకు 2026, వార్డులకు 6648 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు మొత్తం 34 సర్పంచ్‌లు, 124 వార్డుల నామినేషన్లు తిరస్కరించి అధికార పార్టీ ఏకగ్రీవానికి అడ్డదారులు తొక్కారు. జిల్లాలో మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, వరికుంటపాడు, చిల్లకూరు మండలాల్లో చిన్నచిన్న కారణాలతో నామినేషన్లను తిరస్కరించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మర్రిపాడు, చేజర్ల, ఏఎస్‌పేట మండలాల్లో ఆర్‌ఓలు ఇష్టానుసారం ప్రవర్తించారు. ఫోన్‌లో మాట్లాడడం, ఎస్‌ఎంఎస్‌ చూసుకోవడం వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.      

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement