టీడీపీకి వరుస షాక్‌లు.. నాయకుల రాజీనామాలు | Key Leaders Resign To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి వరుస షాక్‌లు.. నాయకుల రాజీనామాలు

Nov 22 2026 9:41 AM | Updated on Nov 22 2026 9:41 AM

Key Leaders Resign To TDP

వేంపల్లె / ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన తమకు సముచిత స్థానం, గుర్తింపు దక్కడం లేదంటూ వేంపల్లె, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన కీలక నాయకులు శనివారం తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు.

పార్టీనే నమ్ముకున్నా న్యాయం జరగలేదు: తెలంగాణ వలి
టీడీపీ మండల మైనార్టీ కన్వీనర్ పదవికి తెలంగాణ వలి రాజీనామా చేశారు. శనివారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఇతర పార్టీల వైపు చూడకుండా టీడీపీనే నమ్ముకుని పనిచేశానని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించకపోవడం మనస్తాపానికి గురిచేసిందన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని విస్మరించడం బాధాకరమని, తనకు తగిన న్యాయం జరగనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం: సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడు సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి శనివారం పార్టీకి రాజీనామా చేశారు. లింగాపురం సొసైటీ చైర్మన్‌గా ఉన్న ఆయనతో పాటు డైరెక్టర్లందరూ తమ రాజీనామా లేఖలను పార్టీ అధిష్టానానికి పంపారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఖాదర్‌బాద్‌ గ్రామంలో మొదటి నుంచి ఎమ్మెల్యేకు అత్యంత కీలక నేతగా ఉన్న నాగమునిరెడ్డిని, సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా కనీసం సంప్రదించకపోవడంతోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల తోలుబొమ్మ: పుణ్యశీల


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement