సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. షర్మిల బెంగళూరులో ధర్నా చేస్తారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌ను కార్నర్ చేస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు అంత వయసు ఉన్న వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఈరోజు షర్మిల కుమార్తె వివాహం గురించి మాట్లాడటం.. వైఎస్ జగన్‌ను కార్నర్ చేయడమేంటి?. వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడమేంటి?. తాను ఏది మాట్లాడినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు అనుకోవడం హాస్యాస్పదం. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా మాట్లాడటం చంద్రబాబు బుద్ధి తక్కువతనమే అవుతుంది. షర్మిల బెంగళూరులో ధర్నా చేస్తారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేయడం.. ఏదో జరిగిపోతుంది అంటూ ఇలా శునకానందం పొందడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్టు.. ఎల్లో మీడియా కోరస్!


