వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్‌ | Anantapur District: YSRCP leader Ramanjaneya Reddy kidnapped | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్‌

Nov 22 2026 9:36 AM | Updated on Nov 22 2026 9:43 AM

Anantapur District: YSRCP leader Ramanjaneya Reddy kidnapped

సాక్షి, అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయుల దాష్టీకానికి దిగారు. వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయరెడ్డిని టీడీపీ మూకలు కిడ్నాప్ చేశారు. గుత్తి మండలం ఊబిచర్ల గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులతో నామినేషన్లు వేయించారు. వైఎస్సార్‌సీసీకి మద్దతు ఇచ్చారన్న కారణంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు కిడ్నాప్‌ చేశారు.

పాతకొత్తచెరువు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ మూకలు దాడి దౌర్జన్యానికి దిగారు. వెంకటేశ్వర్లు ఇంట్లో లేకపోవడంతో  టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. జయరాం వర్గీయుల గూండాగిరిపై ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదు. గుమ్మనూరు జయరాం వర్గీయుల గూండాగిరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్టు.. ఎల్లో మీడియా కోరస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement