కుటుంబ సమస్యను రాజకీయ రచ్చగా మార్చడం వల్ల ఎవరికి లాభం? ఇంటి గౌరవం బజారుకెక్కితే ఎవరికి మేలు జరుగుతుంది? పిల్లల భవిష్యత్తు, కుమార్తె పెళ్లి ప్రశాంతంగా జరగాలన్న ఆలోచన కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యమా? ఆస్తి తనదే అయితే కోర్టుకి వెళ్లచ్చుగా? వెళ్లకుండా పచ్చముఠాతో కలిసి షర్మిల ఈ నీచ స్వార్థ రాజకీయాలు ఎందుకు? అంటూ నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు.
చంద్రబాబు, ఎల్లో మీడియా.. షర్మిలను వైఎస్ జగన్‌పై అస్త్రంగా ప్రయోగిస్తున్నారే తప్ప.. ఆమెపై ప్రేమాభిమానాలు కాదు. అయితే, షర్మిల ఎందుకు గుర్తించడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్న షర్మిల ఎపిసోడ్‌లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాబుకు వెడ్డింగ్ కార్డును ఇవ్వడానికి వెళ్లిన తర్వాతే లైన్ ఎందుకు మారింది?. ఏపీలో హింస, ప్రజా సమస్యలను డైవర్షన్ చేసే కుట్రలు, వైఎస్ జగన్‌ను మానసికంగా దెబ్బతీయాలనే దెబ్బతీయాలనే కుతంత్రం కనబడుతోంది.
వైఎస్ జగన్‌పై ఏది దొరికినా బురదజల్లడానికి అస్త్రంగా మార్చుకోవాలనుకోవడం.. వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు స్పందించని చంద్రబాబు, లోకేశ్.. ఇప్పుడు నీతులు చెప్పడం.. అవసరం అయినప్పుడల్లా ప్రజల దృష్టిని మళ్లించడానికి షర్మిలను రంగంలోకి దించడంతో పచ్చ కుట్రలు ఏంటో ఇట్టే అర్థమవుతున్నాయి.
ఇదీ చదవండి: కుటుంబ గౌరవమా? బాబు రాజకీయ ప్రయోజనాలా?


