జనసేన కార్యకర్త మృతిపై బీటెక్‌ రవి హైడ్రామా | Btech Ravi High Drama On Janasena Worker Death | Sakshi
Sakshi News home page

జనసేన కార్యకర్త మృతిపై బీటెక్‌ రవి హైడ్రామా

Nov 22 2026 12:21 PM | Updated on Nov 22 2026 12:30 PM

Btech Ravi High Drama On Janasena Worker Death

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జనసేన కార్యకర్త మృతిపై బీటెక్‌ రవి హైడ్రామాకు తెరతీశారు. జనసేన కార్యకర్త వీరాంజనేయులు ఇంటికి వెళ్లిన బీటెక్‌ రవి.. టీస్టాల్‌ దగ్గర వీరాంజనేయులకు గుండెపోటు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ మూకల తోపులాటలో తన నాన్నకు గుండెపోటు వచ్చిందని కుమారుడు తెలిపారు. దీంతో టీడీపీకి సంబంధం లేదని బీటెక్‌ రవి బలవంతంగా చెప్పించారు. జనసేన ఆధ్వర్యంలో ధర్నా జరిగితే వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరిగాయంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగితే వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నం చేసిన బీటెక్ రవి.. వైఎస్సార్సీపీ వాళ్లు ఆందోళనలో చేరి వాహనాలు తగులబెట్టారంటూ బుకాయించారు. జనసేన అధిస్థానం పంపిన కేకే అనే నేత రాకముందే బీటెక్ రవి.. వీరాంజనేయులు ఇంటికెళ్లారు. తమ మూకలు నామినేషన్ కేంద్రం వద్ద ఎందుకు ఉన్నారన్న విషయాన్ని బీటెక్‌ రవి దాటవేశారు.

పదవుల దాహంతో టీడీపీ గూండాలు చేసిన అరాచకానికి జనసేన కార్యకర్త బలయ్యాడు. సర్పంచ్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌ కడప జిల్లా, చక్రాయపేట మండలంలోని సురభి గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా జనసేన మద్దతుదారుడిగా జలపాతి నాగమల్లయ్య నాగలగుట్టపల్లె సచివాలయంలో నామినేషన్‌ వేశాడు. టీడీపీ మండల ఇన్‌చార్జ్‌ మహేశ్వరరెడ్డి నామినేషన్‌ పరిశీలనకు బీటెక్‌ రవి, ఎమ్మెల్యే రామగోపాల్‌రెడ్డిలను రప్పించుకొని నామినేషన్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ చేశాడు.

దీంతో ఉదయం నుంచి టీడీపీ గూండాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడితో పాటు జనసేన నేతలను కూడా రానివ్వకుండా వారి నామినేషన్‌ను ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర పన్నారు. సాయంత్రం జనసేన నేతలు పరిస్థితిని పార్టీ నాయకులకు చెప్పడంతో పార్టీ నేతలు నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో టీడీపీ నేతలు రాళ్లతో వారి వెంట పడ్డారు. జనసేన సర్పంచ్‌ అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు పరుగుతీస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

ఇదీ చదవండి: టీడీపీ అరాచకానికి జనసేన కార్యకర్త బలి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement