సాక్షి, వైఎస్సార్ జిల్లా: నాగులగుట్టపల్లిలో జనసేన అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీని టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనలో గుండెపోటుతో జనసేనకు చెందిన వీరాంజనేయులు అనే కార్యకర్త మృతి చెందారని, ఆయన మరణానికి బీటెక్ రవి, పోలీసులే కారణమని ధ్వజమెత్తారు
పొత్తులో భాగంగా నాగులగుట్టపల్లిని జనసేనకు కేటాయించాలని కోరగా, బీటెక్ రవి అంగీకరించారని శ్రీనివాస్ తెలిపారు. తానే స్వయంగా వచ్చి తమ అభ్యర్థితో నామినేషన్ వేయించానని చెప్పారు. అయితే, నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి అక్కడికి వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు.
ఉదయం నుంచే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే వీరాంజనేయులు ప్రాణాలు కాపాడగలిగేవారని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ


