నారా దుశ్శాసనుడి చేతిలో ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy on chandrababu naidu rule | Sakshi
Sakshi News home page

నారా దుశ్శాసనుడి చేతిలో ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’: వైఎస్‌ జగన్‌

Nov 21 2026 7:46 PM | Updated on Nov 21 2026 7:49 PM

 YS Jagan Mohan Reddy on chandrababu naidu rule

తాడేపల్లి: ఏపీలో జరుగుతున్న అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రిగ్గింగులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైనంపై ట్వీట్ చేశారు. అరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోలను పోస్టు చేశారు.

‘‘మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌. ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు - “నారా స్వామ్యం’’. నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’ ’’ అని ధ్వజమెత్తారు.

రక్తపు మరకలు అంటించి.. 
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’లా ఉందని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’, గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’, ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’, నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’ అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’, ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’ ’’ అని చెప్పారు.

ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే..
ప్రజాస‍్వామ్యాన్ని అలా చేయడం కేవలం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌  చేస్తున్నాను. మీరే చూడండి.. హే రామ్‌ సేవ్‌ ఆంధ్ర’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement