చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ష‌ర్మిల‌: కారుమూరు | Karmuru VenkataReddy Comments Sharmila | Sakshi
Sakshi News home page

చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ష‌ర్మిల‌: కారుమూరు

Nov 21 2026 7:02 PM | Updated on Nov 21 2026 7:19 PM

Karmuru VenkataReddy Comments Sharmila

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీపీసీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తున్నార‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరు వెంక‌ట‌రెడ్డి ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న సాక్షి టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగానే వైఎస్‌ జ‌గ‌న్ కుటుంబంపై ష‌ర్మిల‌ కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు, ఎల్లో మీడియాతో ష‌ర్మిల కుమ్మ‌క్కు అయ్యార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బెంగ‌ళూరు య‌ల‌హంక‌లోని వైఎస్ జ‌గ‌న్ నివాసం ముందు ధ‌ర్నా చేసేందుకు ష‌ర్మిల సిద్ధ‌మ‌వుతున్నార‌నే విష‌యం ముందుగా ఎల్లో మీడియాలో రావ‌డం దీనికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ డ్రామాలో భాగంగానే ష‌ర్మిల ఇదంతా చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు వెంక‌ట‌రెడ్డి.

''స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు అంద‌రూ ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కారు ఏపీని సౌత్ బిహార్‌గా త‌యారు చేసింద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ అంశం నుంచి జ‌నం దృష్టిని మ‌ళ్లించేందుకు ష‌ర్మిల‌తో చంద్రబాబు డైవ‌ర్ష‌న్‌ డ్రామాలు చేయిస్తున్నారు. య‌ల‌హంక ఇంటి ముందు షర్మిల ధ‌ర్నా చేయ‌బోతున్నార‌నే వార్త‌ను ముందుగానే ఎల్లోమీడియాకు లీక్ చేశారు. చంద్ర‌బాబుతో క‌లిసి ఈ కుట్ర చేశారు. వివాహ వేదిక‌ను మారుస్తాన‌ని చెప్పిన ష‌ర్మిల ఇప్పుడు ధ‌ర్నా ఎందుకు చేస్తున్నారు?, చంద్రబాబు డైరెక్ష‌న్ ఇచ్చినందుకే ధ‌ర్నాకు సిద్ధ‌మ‌య్యారా?. త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయించిన చంద్రబాబు ఇంటి ముందు ష‌ర్మిల ధ‌ర్నా చేయాల‌''ని వెంక‌ట‌రెడ్డి అన్నారు. 

ఇదీ చ‌ద‌వండి: చంద్ర‌బాబు చేతిలో పావులా మారిపోయిన షర్మిల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement