వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాల దాష్టీకానికి జనసేనకు చెందిన కార్యకర్త బలయ్యారు. జిల్లాలోని చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి నామినేషన్ సెంటర్ వద్ద చోటు చేసుకున్న ఉద్రికత్త పరిస్థితుల్లో జనసేనకు చెందిన అంతల రామాంజులు అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు. జనసేన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పరిశీలనకు వెళ్లే క్రమంలో టీడీపీ మూకలు అడ్డుకుని దౌర్జన్యం చేశాయి. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పెద్ద పెద్ద కేకలతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. ఈ క్రమంలో జనసేన కార్యకర్త రామాంజులు ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు.
ఈరోజు(శనివారం.) ఉదయం నుంచి చీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మూకల దౌర్జన్యానికి దిగాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల పరిశీలనకు వైఎస్సార్సీపీ, జనసేన వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. నాగులగుట్టపల్లిలో పెద్ద ఎత్తున మోహరించిన టీడీపీ మూకలు.. వైఎస్సార్‌సీపీ, జనసేన చెందిన వారిని నిలువరించే యత్నం చేశారు. ఏ ఒక్కరినీ స్క్రూటినీ వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో జనసేనకు చెందిన కార్యకర్త రామాంజులు కుప్పకూలిపోయాడు. దాంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: కూటమిలో ఒకటి ప్రకటించి మరొకటి అమలు చేస్తారు: ఆది నారాయణరెడ్డి


