విజయవాడ: టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన తమ్ముడి కొడుకుల రాజీనామా కొనసాగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌తో రెండు సార్లు చర్చలు జరిగాయని, వారి మాటలు సమాంజసంగా లేవని తెలిపారు. ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతలం ఇదే విషయం చెప్పామని, తాము చెప్పిన దానికి బీజేపీ నేతలు ఏకిభవించారని అన్నారు.
విజయవాడలో ఆది నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. కూటమిలో స్పష్టత లేకుండా ఒకటి ప్రకటించి మరొకటి అమలు చేస్తారు. అనంతపురం, ధర్మవరం, కోస్తా ఒక చోట అన్ని చోట్ల ఇదే పద్ధతి. గెలిచిన ఎంపీటీసీ ఎమ్మేల్యే దగ్గరకు వెళితే మా స్థానం మీరు కొట్టేశారని మాట్లాడతారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో ఢిల్లీ రమ్మని చెప్పారు. 11.40 కి లిస్ట్ వచ్చే ముందు కూడా 11.32 కి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు.
చివరి నిమిషంలో మార్పు చేశారు. చంద్రబాబు, లోకేశ్ చర్చల్లో వాళ్లు చెప్పిన దానికి 0.1 శాతం కూడా మేము అంగీకరించలేదు. మాకు ఢిల్లీలో క్లారిటీ వచ్చే వరకు మా వాళ్ల రాజీనామాలు అలాగే ఉంటాయి.. నా మాట కూడా అదే. మాదవ్ చెబితే మేము పోటీ చేశాం.. మా నిర్ణయం కాదు. చంద్రబాబుకు చెబితే దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇక్కడ కూటమిని బలపెట్టడానికి కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ మాత్రం బీజేపీకి అన్యాయం చేస్తున్నారు.
బలవంతంగా కృష్ణాజిల్లా ఇచ్చారు..
తమ అధ్యక్షుడు వద్దని చెప్పినా బలవంతంగా కృష్ణాజిల్లా ఇచ్చారని ఆది నారాయణ రెడ్డి తెలిపారు. ‘‘చంద్రబాబు, లోకేశ్ చెప్పిన మాటలను మేము అంగీకరించడం లేదు. టీడీపీ మెజారిటీ కాబట్టి వాళ్లే నిర్ణయం తీసుకుంటున్నారు. మనస్సాక్షిగా చర్చలు జరగలేదు.
ధర్మవరం బీజేపీ మండల ప్రెసిడెంట్ అన్నారు.. టీడీపీ తీసుకుంది. అనంతపురంలో సహకారం ఇవ్వలేదు.. ఓటమి పాలయ్యాం. మేము చేసిన సాయానికి మా పార్టీకి టీడీపీ ఎంత ఇచ్చిన తక్కువే. స్థానికంగా ఇదే బ్రేక్ పడుతుంది.. మా దగ్గర ఉన్న కంటే కూడా ఎక్కువే జరిగాయి.
ప్రత్యామ్నాయ పదవులు మేము అడగలేదు. వాళ్లు ప్రతిపాదించలేదు. ఇప్పుడు జరిగిందే రేపు 29 ఎన్నికల్లో జరగదా? అందుకే తెచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నాం. జనసేన లో కూడా ఇదే పరిస్దితి ఉంది..వాళ్లతో మేము మాట్లాడలేదు.. అన్ని చోట్ల గ్యాప్ లు ఉన్నాయి. సీఎం, లోకేశ్‌తో అడిగిన తరువాతే మేము పోటీలో ఉన్నాం. పార్టీ పర్మిషన్ తోనే మేము పోటీలో ఉన్నాం. ఢిల్లీలో క్లారిటీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని చెప్పారు.


