‘అసలు సూత్రధారులను తప్పిస్తున్నారా?’ | YSRCP Leader Nagarjuna Yadav Demands CBI Inquiry Over Job Scam in AP | Sakshi
Sakshi News home page

‘అసలు సూత్రధారులను తప్పిస్తున్నారా?’

Nov 21 2026 4:59 PM | Updated on Nov 21 2026 5:08 PM

YSRCP Leader Nagarjuna Yadav Demands CBI Inquiry Over Job Scam in AP

తాడేపల్లి : ఏపీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారానికి సంబంధించి జనసేన నాయకురాలు రుక్మిణి కోట అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆమెను విచారణ చేస్తే ఎన్ని కోట్లు వసూలు చేశారో తేలుతుందన్నారు. 36 మంది నిరుద్యోగుల నుంచి వసూలు చేసినట్లు చెబుతున్న రూ.7 కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి ఖాతాల్లో జమయ్యాయి? అనేది తేలాల్సి ఉందని నాగార్జున యాదవ్‌ పేర్కొన్నారు. 

ఈరోజు(శనివారం, నవంబర్‌ 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి నాగార్జున యాదవ్‌ మాట్లాడుతూ..‘ దేవాదాయ శాఖలో ఉద్యోగం పేరుతో ఆఫర్ లెటర్ కూడా ఎలా ఇచ్చారు?, ప్రభుత్వ ఎంబ్లమ్, అధికారుల పేర్లు, సంతకాలతో నకిలీ ఆఫర్ లెటర్లు.. సర్వీస్ రిజిస్టర్లు సైతం సృష్టించారు. దేవాదాయ శాఖ అధికారుల డిజిటల్ సంతకాలు ఎలా వచ్చాయి?, ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి ఉద్యోగి పేరు ఎలా చేరింది?, నకిలీ ఆఫర్ లెటర్‌తోనే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగి పేరు నమోదు కావడం వెనుక ఎవరున్నారు?’ అనేది తెలిస్తే అసలు నిందితులు బయటకు వస్తారన్నారు. 

అసలు సూత్రధారులను తప్పిస్తున్నారా?
ధరణి కృష్ణను నిందితురాలిగా చేర్చి  అసలు సూత్రధారులను తప్పిస్తున్నారా?, కైరన్ కన్సల్టెంట్ సర్వీసెస్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ ఎందుకు జరగడం లేదు?, మంగళగిరి, లండన్‌లోని కైరన్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఎందుకు చేయడం లేదు?, నవంబర్ 20న సీబీసీఐడీకి దేవాదాయ శాఖ కమిషనర్ లేఖలో.. మోసానికి, శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ధరణి కృష్ణ అరెస్టు తర్వాత మూడు రోజుల పాటు ఏం జరిగింది?, కైరన్ సంస్థకు, జనసేన కేంద్ర కార్యాలయానికి ఉన్న సంబంధాలపై వస్తున్న ప్రశ్నలకు కోట రుక్మిణి సమాధానం చెప్పాలి. రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసులతో ప్రశ్నించే గొంతులను అణచివేయలేరు.. ఆధారాలతోనే ప్రశ్నిస్తాం. నిజాయితీ నిరూపించుకోవాలంటే కైరన్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ, ఈడీతో విచారణకు కోట రుక్మిణి సహకరించాలి. చిన్న ఉద్యోగిని బలిపశువును చేసి పెద్ద తలకాయలను కాపాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సిరి సహస్ర బీసీ హోదాపై కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement