కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏపీలో ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో.. నాలుగు రెట్ల దౌర్జన్యం పెరిగిపోయిందన్నారు. ఇది చంద్రబాబు హయాంలోనే జరుగుతున్నది కాబట్టి ఈ ఎన్నికలు కచ్చితంగా ఆయనకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.
‘అధికార పార్టీ నేతల కంటే పోలీసుల బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు మాయని మచ్చగా ఏర్పడింది. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏపిలో ఓటు హక్కు కోసం ఎన్నికల నిర్వహణపై ప్రజలు ఉద్యమాలు చేయాలి. డబ్బులు చెల్లిస్తే ఓటు వేసే సంసృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఎన్నికల్లో డబ్బు, దౌర్జనాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంగా మార్చారు. ఎన్నికల అనంతరం దౌర్జన్యాలు, దాడులు సీపీఐ ఆధ్వర్యంలో మేధావులతో చర్చలు సభలు నిర్వహిస్తాం. విష సంస్కృతి తరిమి కొట్టేందుకు ప్రజలను చైతన్య చేస్తాం. 12 ఏళ్ళుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపాలనలో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. మోదీ పాలనలో బడా కంపెనీలకు పెద్ద పీట వేశారు. సర్ పేరుతో జరుగుతున్న ఓట్ల తొలగింపు ఆపాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సిరి సహస్ర బీసీ హోదాపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి


