నాలుగు దశాబ్దాల తర్వాత ముస్లిం అభ్యర్థికి అవకాశం | Muslim Candidate Gets Opportunity After Four Decades | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాల తర్వాత ముస్లిం అభ్యర్థికి అవకాశం

Nov 21 2026 12:59 PM | Updated on Nov 21 2026 12:59 PM

Muslim Candidate Gets Opportunity After Four Decades

నరసరావుపేట(పల్నాడు): మున్సిపాలిటీలో సుమారు 40 ఏళ్ల తర్వాత ముస్లిం మైనార్టీ అభ్యర్థికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. పురపాలక సంఘంలో 1981–83వరకు షేక్‌ ఫరీద్, 1983–86 మధ్య షేక్‌ మహబూబ్‌ సుభాని చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 40 ఏళ్లకు ముస్లిం మైనార్టీల నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా షేక్‌ ఖాజావలి పోటీలో ఉన్నారు. 

మైనార్టీలే అధికం.... 
పట్టణంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. పట్టణంలో మొత్తం 1,07,622 ఓట్లు ఉంటే వాటిలో 26,500 ఓట్లు ముస్లిం మైనార్టీలవే ఉన్నాయి. ఆ తర్వాత స్థానం కాపులకు దక్కుతుంది. ఆ సామాజిక వర్గానికి సుమారుగా 13వేలు, ఆర్యవైశ్యులు 10,500, మాల, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 9,874 ఉండగా వడియరాజులు 6వేలు, రెడ్లు 5వేలు, కమ్మలు 3వేలు,  యాదవులు 2,500వేలు ఉన్నారని రాజకీయ నాయకులు చెబుతున్నారు. 

బీసీలకు వైఎస్సార్‌ సీపీ గుర్తింపు 
షేక్‌ ఖాజావలి మాష్టారును ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎంపిక చేయటం ద్వారా వైఎస్సార్‌ సీపీ బీసీలకు గుర్తింపు ఇచ్చింది. ముస్లింలలో షేక్‌ వర్గీయులు బీసీలుగా పరిగణించబడుతున్నారు. పట్టణంలో సుమారు 41,697 బీసీలు ఉండటం గమనార్హం.  

పట్టణాభివృద్ధికి పెద్ద పీట వేస్తాం 
పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానని ఖాజావలి తెలిపారు. అవినీతిలేని పాలన అందజేస్తామని చెప్పారు. ప్రతిరోజూ ప్రజల సమస్యలను తెలుసుకుంటానని అన్నారు. 48 వార్డుల్లో పోటీ చేస్తున్న పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రతి వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అభివృద్ధే లక్ష్యం–ప్రజాసేవే ధ్యేయం–నరసరావుపేట ప్రగతే తన సంకల్పమని తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement