(పల్నాడు) నరసరావుపేట: బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొత్తమద్ది జాహ్నవి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రకాష్ నగర్‌లోని 16వ వార్డు నుంచి ఆమె వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి లక్ష్మారెడ్డి పట్టణంలో నిత్యావసరాల షాపు నిర్వహిస్తుండగా తల్లి గృహణి. జాహ్నవి హైదరాబాదులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ బిట్స్ పిలానీతో ఒప్పందంతో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ఓ మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకొని అవి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పారు. తనకు వార్డు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.
ఇదీ చదవండి: ఆ రాత్రి ఏం జరిగింది..!


