మత్స్యకారులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు | World Fisheries Day 2026: Ys Jagan Extends Best Wishes To Fishermen | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Nov 21 2026 11:34 AM | Updated on Nov 21 2026 11:45 AM

World Fisheries Day 2026: Ys Jagan Extends Best Wishes To Fishermen

సాక్షి, తాడేపల్లి: మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్ర సోదర, సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ అహర్నిశలు శ్రమించే వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్న‌తి తీసుకురావాలనే లక్ష్యంతో మన ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.16 వేల కోట్లతో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

ఓఎన్‌జీసీ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం అందించాం. ప్రతి మత్స్యకార కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, మీ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను’’ అని ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: కూటమిలో 'పీఠ'లాటకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement