బాబాయి.. అబ్బాయి.. ఓ పంచాయతీ | Family Numbers Competition In Sarpanch Election | Sakshi
Sakshi News home page

బాబాయి.. అబ్బాయి.. ఓ పంచాయతీ

Nov 21 2026 9:49 AM | Updated on Nov 21 2026 9:49 AM

Family Numbers Competition In Sarpanch Election

అక్కడ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన బాబాయి.. అబ్బాయి ఎన్నికల బరిలో ఉండడం చర్చనీయాంశమైంది. పెద్దాపురం మండలం బి.తాటిపర్తి పంచాయతీలో గోపు కుటుంబానికి రాజకీయంగా పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్‌ పదవి కోసం బరిలోకి దిగారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపు సత్యమురళీకృష్ణ సర్పంచ్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండగా, ఆయనకు వరుసకు బాబాయి అయిన గోపు అచ్యుతరామయ్య కూడా పోటీలో ఉండడం విశేషం. 

అచ్యుతరామయ్య 2001 నుంచి 2006 వరకు పెద్దాపురం మండలాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. అదే విధంగా  వైఎస్సార్‌ సీపీ మద్దతుతో గోపు సత్యమురళీకృష్ణ సర్పంచ్‌ అభ్యరి్థగా పోటీకి దిగారు. గత పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా, ఆయన సతీమణి సర్పంచ్‌గా పనిచేశారు. ఈ అనుభవంతో తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏదేమైనా ఒకే కుటుంబానికి చెందిన బాబాయి.. అబ్బాయి.. ఎన్నికల బరిలో ఉండటంతో బంధువర్గం అంతా ఎవరికి ఓటెయ్యాల్లో తెలియక తికమక పడుతోంది.                                                       
కాకినాడ, పెద్దాపురం  

సంగ్రామంలోనే అంబాజీపేట.. 
దేశంలో కొబ్బరి వ్యాపారానికి అంబాజీపేట పెట్టింది పేరు. అయితే ఇది ఇంకా గ్రామమే తప్ప పంచాయతీ కాదు. మాచవరం పంచాయతీలో గ్రామాలుగా కోఠివారి అగ్రహారం, అంబాజీపేట, మాచవరం అగ్రహారం ఉన్నాయి. 1939లో మాచవరం పంచాయతీగా ఏర్పడి మేడిద రామన్న మొట్టమొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో మాచవరం ప్రధాన కేంద్రంగా రెవెన్యూ లావాదేవీలు నిర్వహించేవారు. అయితే కాలక్రమేణా వివిధ గ్రామాల నుంచి కొబ్బరిని అంబాజీపేటకు తీసుకొచ్చి వ్యాపారాలు జరుపుతున్నారు. కొబ్బరి వ్యాపారులు లావాదేవీలు నిర్వహించుకునేందుకు అంబాజీపేటలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశారని ప్రముఖ కొబ్బరి వ్యాపారి వీకే రావు తెలిపారు. 1985లో మండల వ్యవస్థ ఏర్పాటైనా అంబాజీపేట మండలంగానే ఏర్పాటైంది. పంచాయతీ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికలు జరిగినా అంబాజీపేట మండలంగానే పరిగణించడం విశేషం. విచిత్రమైన విషయం ఏమిటంటే, రెవెన్యూ రికార్డుల్లో మాచవరం పంచాయతీగా నమోదైతే ప్రభుత్వ కార్యాలయాలు మండల ప్రధాన కేంద్రం అంబాజీపేటగానే ప్రాముఖ్యం చెందింది. ప్రస్తుతం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.                      
–అంబాజీపేట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement