జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతరాజ్‌ | Kakinada ZP Chairman Burra Divya Sunitha Raj | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతరాజ్‌

Nov 21 2026 9:26 AM | Updated on Nov 21 2026 9:26 AM

Kakinada ZP Chairman Burra Divya Sunitha Raj

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బుర్రా దివ్య సునీతరాజ్, వైస్‌ చైర్‌పర్సన్‌గా పంపన రాజేశ్వరీదేవి ఎన్నికయ్యారు. జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్, ఎన్నికల పరిశీలకురాలు బి.లావణ్యవేణి హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఆశించిన కాకినాడ రూరల్‌ జెడ్పీటీసీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు.

 దీంతో, సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత జిల్లాలోని 20 మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులతో అక్షర క్రమంలో కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్లుగా సునీతరాజ్, పంపన రాజేశ్వరీదేవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లూ విదేశాల్లో ఉన్న తాను మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని సునీతరాజ్‌ అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ సీఈఓ వీవీఎస్‌ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement