జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌ | Sugavasi Prasad as ZP Chairman In Annamayya District | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌

Nov 21 2026 7:38 AM | Updated on Nov 21 2026 7:41 AM

– వైస్‌ చైర్మన్‌గా తలారి శరణ్య  

సాక్షి, మదనపల్లె: అన్నమయ్యజిల్లా తొలి జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశం శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 18 మంది టీడీపీ, ఒక జనసేన జెడ్పీటీసీ హాజరయ్యారు. వీరందరి చేత కలెక్టర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం నిర్వహించిన ఎన్నికలో  చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌ (గాలివీడు జెడ్పీటీసీ), వైస్‌ చైర్మన్‌గా తలారి శరణ్య (పెద్దతిప్పసముద్రం జెడ్పీటీసి)లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పారీ్టకి చెందిన ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాలేదు. వీరు జెడ్పీ సాధారణ సమావేశం జరిగే రోజు లేదంటే అంతకుముందు ప్రమాణస్వీకారం చేయవచ్చని కలెక్టర్‌ ప్రకటించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. సీఈవో లక్షి్మపతి, అధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement