జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

ముగిసిన రెండవ దశ నామినేషన్లు

– వైస్‌ చైర్మన్‌గా తలారి శరణ్య

సాక్షి, మదనపల్లె: అన్నమయ్యజిల్లా తొలి జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశం శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికై న 18 మంది టీడీపీ, ఒక జనసేన జెడ్పీటీసీ హాజరయ్యారు. వీరందరి చేత కలెక్టర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌ (గాలివీడు జెడ్పీటీసీ), వైస్‌ చైర్మన్‌గా తలారి శరణ్య (పెద్దతిప్పసముద్రం జెడ్పీటీసి)లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాలేదు. వీరు జెడ్పీ సాధారణ సమావేశం జరిగే రోజు లేదంటే అంతకుముందు ప్రమాణస్వీకారం చేయవచ్చని కలెక్టర్‌ ప్రకటించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. సీఈవో లక్ష్మిపతి, అధికారులు పాల్గొన్నారు.

స్కౌట్‌తో విద్యార్థుల

సర్వతోముఖాభివృద్ధి

మదనపల్లె సిటీ: విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.అనూరాధ అన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కౌట్స్‌,గైడ్స్‌ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్‌ మాస్టర్లకు నిర్వహిస్తున్న బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ శిక్షణా శిబిరాన్ని ఆమె సందర్శించారు. శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స, వివిధ రకాల బ్యాండేజీలు కట్టడం, తాళ్లతో వివిధ రకాల ముడులు వేయడం, పయోనీరింగ్‌ నిర్మాణాలు తదితర ప్రాక్టికల్‌ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. స్కౌట్‌మాస్టర్లు, యూనిట్‌ లీడర్లు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచేలా రోల్‌ మోడల్స్‌గా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో లీడర్‌ ట్రైనర్లు కమల్‌కన్నన్‌, శివప్రసాద్‌, వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ కమిషర్‌ హర్షవర్దన్‌రెడ్డి, రిసోర్సుపర్సన్లు మోహన్‌బాబు, ప్రసాద్‌, మహమ్మద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఉచిత కార్పొరేట్‌ విద్య

మదనపల్లి (కురబలకోట) : ఎస్సీ, డీనోటిఫైడ్‌ తెగల (డీఎన్‌టీ) విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రేష్ట (నెట్స్‌)–27 పథకాన్ని వినియోగించుకోవాలని అన్నమయ్య జిల్లా షెడ్యూల్స్‌ కులాల సంక్షేమ, సాధికారిత అధికారి దామోదర్‌ రెడ్డి కోరారు. ఈ పథకం ద్వారా ఎంపికై న విద్యార్థులకు 9,11వ తరగతుల్లో కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్య అందిస్తారని తెలిపారు. విద్యకు సంబంధించిన పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 2400 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 30లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) జనవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. దరఖాస్తు, పరీక్షకు ఎలాంటి రుసుము లేదన్నారు. ఆసక్తిగలవారు అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండవ దశ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. సర్పంచ్‌ స్థానాలకు చివరిరోజు 288 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1079 నామినేషన్లు వచ్చాయి. ఇక వార్డు స్థానాలకు సంబంధించి చివరిరోజు 1138 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజులకు కలిపి వార్డు సభ్యులకు మొత్తం 3257 నామినేషన్లు వచ్చాయి.

ప్రసాద్‌ శరణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement