ఎస్పీ ధీరజ్ కనుబిల్లి
● నామినేషన్ల వేళ
మదనపల్లె టౌన్: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 21 నుంచి 23 వరకు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 156 పంచాయతీలకు 43 సెంటర్లలో స్వీకరిస్తారని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని నిబంధనలు వివరించారు.. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల వరకు ఇతరులు, వాహనాలకు ప్రవే శం లేదని, ర్యాలీలు, ఊరేగింపులు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అభ్యర్థి, ప్రతిపాదకులను మాత్రమే లోపలికి అనుమ తిస్తారని, ప్రతి కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. 30 యాక్ట్, బీఎన్‌ఎస్‌ఎస్ 163 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


